• icon ఆధ్యాత్మిక తెలుగు విశేషాలు


🌹*😊క్షమ - పగ😡*🌹

kshama.jpeg
*మన మనసులో రెండు వైరుధ్య భావా లుంటాయి. ఒకటి క్షమించడం, రెండోది పగ తీర్చుకోవడం. ఈ రెంటికీ సదా సమరం జరుగుతూ ఉంటుంది. క్షమ గెలిస్తే హృదయం ఆనంద మయం అవుతుంది. మనసులో అంతు లేని సంతోషం కలుగుతుంది. మనలో ఉండే ప్రేమ ఎప్పుడూ 'క్షమించు క్షమించు' అని చెబుతూనే ఉంటుంది. ప్రేమిస్తే ప్రేమ ను పొందుతాం. ద్వేషిస్తే ద్వేషాన్నే తిరిగి పొందుతాం.*
*గుండెలో పగ దాచు కోవడం అంటే 'పామున్న ఇంటిలో ఉండటమే' అంటుంది భారతం. పగ వల్ల పగ పోదనీ.. ఏ విధంగా చూసి నా పగని అణచడం లెస్స అనీ..భారత మహేతి హాస ఉద్బోధ...!!!*
*'నా కన్ను నువ్వు పొడిస్తే..నీ కన్ను నేను పొడుస్తా' అని 'కన్ను'కు కన్ను... పన్నుకు పన్ను' సిద్ధాంతం తో అందరూ ముందుకు దూకితే- లోకం అంతా..గుడ్డి వాళ్ల తో..బోసి నోటి వాళ్ల తో నిండి పోతుంది.*
*ప్రతీకారం అనే విష చక్రం నుంచి బయట పడాలంటే "క్షమించడం" ఒక్కటే ఉపాయం. ఇందు వల్ల రెండు లాభాలున్నాయి. ఒకటి- క్షమించే వారు, ఆదర్శ వ్యక్తులుగా గౌరవం పొందుతారు. రెండోది- క్షమ పొందేవారు, తమ జీవితాలను సరి దిద్దుకుంటారు.*
*క్షమా గుణం శత్రువును సైతం మిత్రుడి గా...మార్చేస్తుంది. 'పొరపాటు' అనేది. మానవ సహజ గుణం. క్షమ దైవ విశిష్ట గుణం' అని ఆంగ్ల సామెత.*
*మహా భక్తుల జీవితాలన్నీ...ప్రేమ మయాలు.*
*ఏక నాథుడు పాండు రంగడి భక్తుడు. ప్రశాంత చిత్తుడు. సదా స్వామి సేవలో, భజన లో కాలం గడిపే వాడు. ప్రజలందరూ ఆయన్ని ప్రశంసించడం చూసి కొందరు ఈర్ష్య పడ్డారు. ఎలా గైనా ఏక నాథుడికి కోపం తెప్పించాలని ప్రయత్నించ సాగారు. ఒక దుష్టుడికి డబ్బు ఆశచూపి, ఆ పనికి నియోగించారు.*
*ఏక నాథుడు రోజూ తెల్లవారు జామునే నది లో స్నానం చేసి వచ్చేవాడు. ఆ సమయం లో ఆ దుష్టుడు ఏక నాథుడి పై ఉమ్మి వేశాడు. ఏక నాథుడు ప్రశాంత చిత్తంతో చిరు నవ్వు చెరగ నీయ కుండా మళ్ళీ... వెనక్కి వెళ్లి నదీ స్నానం ఆచరించాడు..*
*ఇలా మొత్తం నూట ఏడు సార్లు జరిగింది.*
*ఏకనాథుడు ఏమాత్రం నిగ్రహం వీడ కుండా మందస్మిత వదనం తో అన్ని సార్లూ మరల మరల స్నానం చేసి వస్తున్నాడు.*
*దీంతో ఆ కుటిలుడి హృదయం చలించి పోయింది!*
*ఆయన ఏక నాథుడి కాళ్లపై పడ్డాడు. 'స్వామీ, మీరు నిజం గా దైవ స్వరూపులు. మీ నిగ్రహం చెడ గొట్టి, ఎలా గైనా మీకు కోపం తెప్పించాలని కొందరు నన్ను పురమా యించారు. మీకు ఆగ్రహం తెప్పించ గలిగితే నాకు ధనం ఇస్తా మని ఆశ చూపారు. "మీ క్షమాగుణం" తెలియక నేను ఈ నీచ కృత్యానికి అంగీకరించాను!' అన్నాడు ఆ వ్యక్తి పశ్చాత్తాపం తో.*
*ఏకనాథుడు అతడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. 'నాయనా, నీవు నా కెంతో మేలు చేశావు. నా చేత నూట ఎనిమిది సార్లు పవిత్ర నదీ స్నానం చేయించిన మహాను భావుడివి నువ్వు! నేను నీ మేలు ఎన్నటికీ మరచి పోను!'*
*ఏక నాథుడి పలుకులు విని అవతలి వ్యక్తి నిర్విణ్ను డయ్యాడు.*
*ఆ భక్తా గ్రేసరుడి "క్షమాగుణం' ఆ ఉమ్ము వేసిన వ్యక్తి హృదయాన్ని ప్రక్షాళనం గావించింది. పశ్చాత్తాపం తో అతడు కన్నీరు కార్చాడు.*
*క్షమ అంటే భూమి. భూమి ఓర్పు గల తల్లి కను కనే మనం ఎంత బాధ పెట్టినా భూ మాత మన పై పగ తీర్చు కోవాలను కోదు. క్షమించే గుణం ఉన్నది కదా అని మనం భూమాతను అదే పనిగా హింసించ కూడదు.*
*క్షమా గుణానికీ హద్దులుంటాయని గుర్తుంచు కోవాలి! క్షమాగుణం పురాణాలకు, ప్రాచీన ఇతి హాసాలకే పరిమితం కాదు.*
*ఇటీవలి చరిత్రలో క్షమాగుణం తో చరితార్థు లైన మహాపురుషు లెందరో ఉన్నారు.*
*ఆర్య సమాజ స్థాపకు లైన మహర్షి దయానంద నిష్కాపట్యం, నిర్భయత్వం సమాజం లో అనేకులకు కంట గింపైంది.*
*ఆయన వద్ద వంట వాడికి లంచం ఇచ్చి, ఆహారం లో విషం పెట్టించారు.*
*దయానందులు మృత్యుశయ్యపై ఉన్నారు.*
*తన వంటవాడిని దగ్గరకు పిలిచారు. కొంత డబ్బు అతడి చేతి లో పెట్టి ఇలా అన్నారు. 'వెంటనే నువ్వు నేపాల్‌కి వెళ్లిపో! నా శిష్యులకు నువ్వు చేసిన పని తెలిస్తే నిన్ను బతక నీయరు!'*
*తనకు ప్రాణ హాని కలిగించిన వ్యక్తిని సైతం క్షమించి, అతడికి ప్రాణ దానం చేసిన మహర్షి దయానంద చరితార్థులయ్యారు.*
*క్షమాగుణం మానసిక రుగ్మతలకు మంచి మందు.*
*పగ తీర్చుకుంటే ప్రశాంతత చిక్కుతుందను కోవడం కేవలం భ్రాంతి మాత్రమే!*
*నిజానికి అభద్రత మిగులు తుంది. చిత్త వికారం ఏర్పడుతుంది. చివరకు జీవితం విషాదాంతం అవుతుంది.*
*ఒక సామెత ఇలా చెబుతుంది--*
*ఇతరులు మనకు చేసిన అప కారాలను ఇసుక పై రాయాలి. ఇతరులు మనకు చేసిన ఉప కారాలను చలువ రాయి పై చెక్కు కోవాలి!'*
🕉️🌞🌏🌙🌟🚩🙏🌹🕉️
*🧘‍♂️శ్రీరమణీయం🧘‍♀️*
🕉️🌞🌏🌙🌟🚩
*"కోరికలు ఉన్నంత కాలం జన్మలు వస్తూనే ఉంటాయా ?"*
*"అవును నిజమే ! కోరికలు పుట్టించే మనసుకు మూలంలో ఉన్నది భగవంతుడే. కనుక కోర్కెలు తీర్చేందుకు ఎన్ని జన్మలైనా ఇస్తూనే ఉంటాడు.*
*కోరికలు ఉన్నంత కాలం మనకి భిక్షపాత్రలాంటి ఈ దేహం తప్పదు. మనలోని భగవత్ శక్తిని గమనించకుండా, అంతా మన ప్రమేయంతోనే జరిగిపోతుందని భావించటం మన లోపం.*
*సహజంగా 'నాకంత శక్తిలేదు' అని అంటూ ఉంటాం. అంటే ఆ శక్తి మన ఇష్టానుసారం లేదని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది !*
*నిద్ర లేచినా, ఆలోచించినా, పనులుచేసినా ప్రతిదీ మనలో నుండి వెలువడే ఆత్మశక్తే చేస్తుంది. ఆ శక్తి విషయంలో మనకు స్వతంత్రత లేదు. మనసును జయించిన యోగి మాత్రమే స్వతంత్రంగా అనుభవించగలడు.*
*మనం ఆశక్తిగా మారేంత వరకూ ఏదీ మనం చేసేదికాదు. దేహభావనతో కలిగే కర్తృత్వంమే మన అజ్ఞానమని అర్థమైతే అహంకారం తగ్గిపోతుంది ! కోరికలు నశించి జన్మపరంపర సమసిపోతుంది".* 🕉️🌞🌏🌙🌟🚩🙏🌹🕉️
24

🌹జీవితం🌹

manchi.jpeg
*ఎ. తగ్గించవలసిన మూడు విషయాలు:*
*(1) ఉప్పు*
*(2) చక్కెర*
*(3) పాలపొడి*
*బి. పెంచవలసిన మూడు అంశాలు:*
*(1) ఆకుకూరలు*
*(2) కూరగాయలు*
*(3) పండ్లు*
*C. మర్చిపోవలసిన మూడు విషయాలు:*
*(1) మీ వయస్సు*
*(2) మీ గతం*
*(3) మీ ద్వేషం*
*D. మూడు విషయాలు కలిగి ఉండాలి:*
*(1) నిజమైన స్నేహితులు*
*(2) ప్రేమగల కుటుంబం*
*(3) సానుకూల ఆలోచనలు*
*E. ఆరోగ్యంగా ఉండటానికి నాలుగు చర్యలు:*
*(1) ఉపవాసము*
*(2) నవ్వడం*
*(3) వ్యాయామం*
*(4) బరువు తగ్గించడం*
*F. వేచి ఉండకూడని నాలుగు విషయాలు:*
*(1) మీరు నిద్రించడానికి నిద్ర వచ్చే వరకు వేచి ఉండకండి.*
*(2) మీరు విశ్రాంతి తీసుకోవడానికి అలసిపోయే వరకు వేచి ఉండకండి.*
*(3) స్నేహితులను సందర్శించడానికి మీ స్నేహితుడు అనారోగ్యానికి గురయ్యే వరకు వేచి ఉండకండి.*
*(4) దేవుణ్ణి ప్రార్థించడానికి ఇబ్బంది తలెత్తే వరకు వేచి ఉండకండి.*
*మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ...... యవ్వనంగా ఉండండి .....!!*
*5. మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో మనం ఆలోచించకూడదు!*
*6. నేరుగా ప్రభావితం కాని*
*ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకండి!*
*7. మీకు నచ్చని వ్యక్తుల గురించి ఆలోచించకూడదు,*
*8. నేను ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచం ఇలాగే సాగిపోతుందని గ్రహించు!*
*9. ప్రియమైన వారి ఇష్టాలను కనుగొనండి. నేరాల వెంట పడొద్దు!*
*10. క్షమించడానికి ప్రయత్నించండి!*
*11. ఒక్కొక్కరు ఒక్కో రోజు ఈ స్థలాన్ని విడిచి వెళ్లాలని ఎప్పటికప్పుడు మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు మీ చుట్టూ ఉన్నవారు ప్రేమిస్తున్నారని భావిస్తారు!*
*12. పిల్లలతో మాట్లాడే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి!*
*13. నవ్వే అవకాశం, ఏడ్చే అవకాశం అదృష్టమని గుర్తించండి!*
*14. ప్రేమ విలువను అర్థం చేసుకోండి మరియు మనల్ని ప్రేమించే వారిని తిరిగి ప్రేమించండి!*
*జీవితం అనేది చిన్న ఏడుపు మరియు గొప్ప నిశ్శబ్దం మధ్య పోరాటం !!!*
23

🌹దైవేశ్చు :-🌹

devi.jpeg *ఒక అద్భుతమైన కథ..!!*
ఒక వీధులు ఊడ్చే వ్యక్తికి రోజూ పని చేసి చేసి ఆ పని మీద విసుగొచ్చింది. ఊడ్చే చోట రోడ్డు పక్కన ఓ గుడి ఉంటే ఆ మెట్లపైన కూర్చుండి ప్రతి రోజూ ఓ దేవుడా.... "నువు రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు. నా బతుకు చూడు ఎంత కష్టమో... ఒక్క రోజు... ఒక్కటంటే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా" అని దేవుడితో మొరపెట్టుకునేవాడు, అయినా దేవుడు ఏమీ స్పందించలేదు రోజూ ఇలాగే అంటూ కొన్నాళ్ళకి విసిగిపోయి, నా పని చేయటం ఆ దేవుని వల్ల కూడా కాదు అంత శక్తి ఆయనకుంటే గనక ఈపాటికి ఎప్పుడో స్పందించేవాడు అని సవాలు విసిరాడు. దేవుడు కూడా ఇతని మాటలు వినీ వినీ ఓ రోజు సరేనన్నాడు, నా పని నువ్ చెయ్ నీ పని నేను చేస్తా కానీ ఒక్క షరతు అన్నాడు దేవుడు, షరతు ఏమిటంటే నీ ముందుకొచ్చిన భక్తులు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించ కూడదు, నోరు మెదపకూడదు." అన్నాడు దేవుడు. "సరే" అన్నాడు మనోడు. తెల్లారే సరికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు. "దేవుడా... నేను మరో కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు" అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు. దాంతో ధనవంతుని ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది. అతను చూడకుండా వెళ్లిపోయాడు. మనోడు "ఒరేయ్... పర్సు వదిలేశావు చూసుకోరా..." అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు. ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు. "దేవా... నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అది నీకు సమర్పించు కుంటున్నాను. దయచూడు తండ్రీ" అంటూ మోకరిల్లాడు. కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది. "ఇలా దయ చూపించావా తండ్రీ" అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు. "ఒరేయ్ దొంగా ఆ పర్స్ నీది కాదురా.... " అని అరుద్దామనుకున్నాడు మనోడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు. ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు. "దేవుడా రేపు సముద్ర ప్రయాణం ఉంది. నన్ను చల్లగా కాపాడు స్వామీ" అన్నాడు. అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. "నా పర్సు ఈ గదిలోనే పోయింది, నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును తీసుకుని ఉంటాడు, పట్టుకొండి" అన్నాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి తీసుకెళ్తుంటే, మనోడు సహించలేక పోయాడు, ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఆపాలనుకున్నాడు, దాంతో ఉండబట్టలేక పోయాడు. దేవుడు పెట్టిన షరతు మర్చిపోయాడు, వెంటనే "ఒరేయ్ ఆగండ్రా... ఈ నావికుడు నిర్దోషి. పర్సు తీసుకున్న అసలు వ్యక్తి ఇంకొకడు. వాడు(పేదోడు) పర్సును తీసుకెళ్లాడు" అని అరిచేశాడు. దేవుడే చెబుతుంటే, ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి, పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు. సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు. దేవుడు కూడా వీధులు ఊడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు. "దేవుడా... ఇవ్వాల నేను ఎంత మంచి పని చేశానో తెలుసా... నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను. ఒక దోషిని అరెస్టు చేయించాను" అన్నాడు మనోడు పెద్ద తోపులా "ఎంతపని చేశావోయ్. నిన్ను అసలు స్పందించొద్దన్నాను కదా... ఎందుకలా చేశావు" అన్నాడు దేవుడు నిష్ఠూరంగా. "అదేమిటి దేవుడా, మంచిపని చేసిన నన్ను నువ్వు మెచ్చుకుంటావనుకున్నాను" అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా.... అప్పుడు దేవుడు మాట్లాడుతూ "ధనవంతుడు వ్యాపారంలో మోసాలు చేసిన మహా పాపాత్ముడు" వాడు అందరినీ దోచుకుంటాడు. వాడి డబ్బు కొంత పేదోడికి అందితే ధనవంతుడికి కొంచమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. అలాగే ఆ పర్స్ లోని డబ్బులతో పేదోడి కష్టాలు కొన్నైనా తీరేవి. వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవారు. ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. విధి లిఖితం ప్రకారం రేపు సముద్రంలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు, అదే నావికుడు అరెస్టై జైల్లో ఉంటే సముద్రయానం ఆగిపోయేది వాడితో బాటు ఇంకొందరు ప్రయాణీకులు కూడా బతికిపోయేవారు. ఇప్పుడు చూడు... పేదోడు జైల్లో ఉన్నాడు. ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు. నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావయ్యా నువ్వు...అన్నాడు దేవుడు. దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు. కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు. తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పై ఉండవచ్చు. ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం మానవ మాత్రులకు సాధ్యం కాదు. అందుకే ఏది జరిగినా మనమంచికే అనుకుంటూ భారమంతా భగవంతునికే అప్పగించి ఆయన స్మరణ లో ఉండాలి అంతే.🙏
22

🌹యుగాలు వాటి పేర్లు :-🌹

devi.jpeg 1 కృతయుగము
2 త్రేతాయుగము
3 ద్వాపరయుగము
4 కలియుగము
మొత్తం నాలుగు యుగాలు - ఏ యుగం ఎలా ఆరంభమైంది ? ఎలా ముగిసింది ?
వేదాలను అనుసరించి యుగాలు మొత్తం నాలుగు. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఇలా ఒక్కో యుగానికి ఒక్కో భగవంతుడు ఉండగా జ్యోతిష్య గ్రంథం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కో గ్రహం రాజు, మంత్రి అని చెబుతున్నారు. మరి పురాణాలూ, శాస్రాలు యుగాల గురించి ఎం చెబుతున్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. కృతయుగం:-
నాలుగు యుగాలలో మొదటిది కృతయుగం. దీనినే సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగం నందు నారాయణుడు లక్ష్మి సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము పదిహేడు లక్షల ఇరవై ఏడూ వేల సంవత్సరములు. ఈ యుగం లో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ యుగంలో అకాలమరణాలుండవు. ఇక ఈ కృతయుగమునకు రాజుగా సూర్యుడు అంటే రవి మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులయ్యారు. బంగారమునకు అధిపతి గురువు కావున ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారుమయముగా ఉండేది. ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భావ విభేదము విరోధము లేక చక్కగా కాలకు నడిచినది. సూర్య ప్రభావము చేత సుక్షత్రియులు, గురు ప్రభావము చేత సద్బ్రాహ్మనులు జనించి ధర్మ మయిన పాలన నడిచినది. ఇక సకాలమునకు వర్షం మంచి పంటలు పాడి పశువులు అభివుద్ది చెంది ప్రజలు సుఖమయిన జీవనము గడుపుతూ ధర్మమయిన పాలన సాగుతుంది. సూర్య, గురు వులు వారికి మిత్ర గ్రహములయైన కుజ, చంద్ర, కేతువుల సహాయముతో ధర్మమయిన పాలన చేస్తూ ఉన్నారు. శని, శుక్ర, బుధ, రాహు గ్రహములు కదలక మెదలక కొంత వరకు వాగ్వివాదము కల్పించ ప్రయత్నము చేసిరి. శని, శుక్ర, బుధ, రాహు గ్రహ కారకముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదమునకు దిగు వానిని చూసి శాపానుగ్రః శక్తి గలిగిన బ్రాహ్మణులు కోపమాపలేక వీడు రాక్షసుడై పుట్టేందుకే ఇటువంటి అన్యాయ ప్రవర్తన ఇటువంటి మాటలు మాట్లాడు తున్నాడు అని అనడము వలన ఆ తపోశక్తి శాప రూపమున త్రేతాయుగములో రాక్షస వంశము అధికమయ్యెను. తపస్సుచే దైవబలమును సంపాదించారు కాని కోపము ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగములో క్రూరులు, రాక్షస స్వభావులు, రాక్షసులు, కలహము పెంచేవారు అధికమయ్యారు. ఈవిధముగా కృతయుగమున సవ్యముగా నడిచి త్రేతాయుగము ఆరంభమయినది.
2. త్రేతాయుగము :-
త్రేతాయుగము లో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు. ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగం కాల పరిమాణము పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము మూడు పాదములపై నడుస్తుంది. ఇక త్రేతాయుగమునకు రాజుగా కుజుడు అంటే మంగళుడు. మంత్రిగా శుక్రుడు నియమితులైయ్యారు. కుజుడు పురుష కారకుడు యువకుడు , యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహు బాల పరాక్రమ వంతుడు, సత్యము పలుకు వాడు రాజుగా ఆచారమునకు కట్టుబడి ఉండక తిరుగువాడు. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు స్త్రీలకు కారకుడు మాయ మంత్ర తంత్రవాది కుజునకు పరమ శత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలము పాలించవలసి వచ్చింది. రాక్షస గురువు శుక్ర బలమున దుష్ట శక్తి, మాయా మంత్రం ప్రభావము చేత రాక్షసులను పురిగోలిపి యజ్ఞ యాగాది క్రతువులకు, తపస్సంపన్నులకు , రూపవతులయిన స్త్రీలకూ, బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి బాధించేవాడు. రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుకు పడకపోవడం చేత మంత్రులు క్రూర స్వభావులై రాజ్య పాలనను బ్రష్టు పట్టించి స్త్రీ వ్యామోహము వలన కలహము పెంచి ప్రజలను పీడించి రూపవతులు అగు స్త్రీలచే, యువకులకు ప్రాణ హానిని కలిగించేవారు. నాలుగు హంగులలో ప్రథమ మయిన మంత్రము యజ్ఞ యాగాదులు మొదలగు దైవ కార్యములు వాటిని జరిపించు బ్రాహ్మన వంశాములను అంతరించేలా చేసేవారు. ఇలా రాక్షసుల వలన, దుర్మార్గుల వలన మంత్రి సామంతుల వలన త్రేతాయుగములో నాలుగింట ఒక భాగము దెబ్బతిన్నది. కుజ గ్రహ బలము చేత ధనుర్ విద్యా పారంగతులు అయిన రాజ యువకుల చేత రాక్షస సంహారము చేయించుచు, అధర్మపరులను శిక్షిస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ స్త్రీలకూ రక్షణ కల్పిస్తూ ధర్మమును కొంత రక్షించెను. ఈవిధంగా త్రేతాయుగమున ధర్మము నాలిగింట ఒక పాదము తగ్గి ద్వాపరయుగం మొదలవుతుంది.
3. ద్వాపరయుగం : -
ద్వాపరయుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఈ యుగం కాల పరిమాణము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది. ద్వాపర యుగమున రాజుగా చంద్రుడు , మంత్రిగా బుధుడు నియమితులయి పాలన చేస్తున్నారు. చంద్రుడు గురు గ్రహ వర్గమునకు చెందినా వాడు బుధుడు శని వర్గమునకు చెందిన వాడు. వీరు ఒకరికి ఒకరు పడనివారు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు, దుష్టులకు ఇచ్చి సాదువుల సజ్జనుల, రూపవతుల, పతివ్రతలకు, కన్యలకు అపకారము చేయు వారిని పురిగొల్పుతాడు. బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహార్ములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు. దేవతా కార్యములు అర్థ భాగము నశింప చేసి, రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంత వరకు మారుస్తాడు. ఇక ఈ యుగంలో నాలుగు హంగుల ధర్మములో రెండు హంగులు మాత్రమె నిలిచింది. చంద్రుడు సకల విద్యా పారంగతుడు బలవంతుడు మనో కారకుడు మాతృ కారకుడు కాన రాజుల విధ్యాపారంగుతులను చేసి ధనుర్ విద్య నేర్పించి దుష్టులను ప్రబలకుండా ఈ మాంత్రికులను, వామాచారులను, మాయావులను నాశనము చేయుటకు స్వయముగా భగవానుడే కృష్ణుడిగా అవతరించి దేవతా వర్గమున కొందరిని అంటే ఇంద్రుని అంశలు ధర్మ రాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు తోడుచేసుకొని ద్వాపరయుగ అంతమున మంత్రయుగమును మటు మాయం చేస్తాడు. ఈ విధంగా ద్వాపర యుగమున ధర్మము రెండు భాగాలు నశించి కలియుగము ప్రారంభము అవుతుంది. అంటే మంత్రం యుగము అంతరించి యంత్రయుగము ప్రారంభము అవుతుంది.
4. కలి యుగము : -
మన ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం. కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరిస్తాడని చెబుతారు. కలియుగం కాల పరిమాణము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు. సూర్య సిద్ధాంత ప్రకారము క్రీ.పూ 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభం అయింది. ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తారు. ఈ కలియుగమునకు రాజు శని మంత్రులు రాహు కేతువులు. రాహువు కేతువు ఇద్దరికీ ఒకరు అంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కొంత కాలము రాహువు మంత్రిగా కొంత కాలము కేతువు మంత్రిగా పాలన చేయుచున్నారు. నాలుగు ధర్మ శాస్త్రములు అదృశ్యం అవ్వగా అప్పుడు కలియుగము ముందుకు నడిచేను. ధర్మమును నిలబెట్టు శాస్త్రములు ఉన్న తన పని సాగదని కలియుగము నడవదని తలంచి కలియుగ ఆరంభములోనే శాస్త్రములను వారిని రక్షించు బ్రాహ్మణులను, అగ్రహారములను, రాజులను ఒక్కొక్కటిగా నశింపు చేస్తూ వచ్చాయి. ఇక అప్పటినుండి కూరము, కుచ్చితము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలెత్తాయి. ఈ యుగంలో వావి వరుసలు తప్పి, వర్ణ సంకరములు మొదలై, దొరలే దొంగలయ్యారు. దైవభక్తి తగ్గి, గురుభక్తి, మాతృపితృ భక్తి అపురూపము అయింది. దైవమును నమ్మి పూజించు కాలము పోయి గురువును పూజించు కాలము వచ్చింది. ఇక హింసా సిద్ధాంతము ఎక్కువ అయి, పాపము వలన దుఖము అనుభవిస్తాము అన్న భయమే లేకుండా పోయింది. పుణ్య కార్యములు కరువయ్యాయి. ఎలాగైనా ధనాన్ని, స్త్రీని పొందినవాడే గొప్పవాడని అనుకునే వారు ఎక్కువయ్యారు. దొంగలకు దారి చూపే వారు ఎక్కువయ్యారు. ఇంకా ప్రజలు స్వధర్మమును వీడి అన్య ధర్మములను ఆచరించు కాలమునాకు పోయారు. వర్ణ ద్వేషాలు, మత ద్వేషాలు పెరిగాయి. మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు. అయితే కేతువు మంత్రిగా ఉన్న ఈ కాలములో కొంత మంది ధర్మాత్ములు పుట్టి లోకమునకు మంచి మార్గమును చూపెట్టు పనులు చేస్తున్నారు. ఈవిధంగా కలియుగం మంచి అనేదానికి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతూ నడుస్తుంది. కలియుగం అంతంలో భగవంతుడు కల్కి గా అవతరించి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమము చేస్తాడని చెబుతారు.
21

🌹💐💐కలియుగ వైకుంఠ వాసునికి,ఏడు కొండలు💐💐🌹

devi.jpeg తిరుమల తిరుపతి లోగల ఏడు కొండలపై కొలువై వున్నాడు కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు . భక్తుల కోరికలను తీర్చే అభయ హస్తుడు శ్రీనివాసుడు.
వెంకన్న కొలువై వున్నా ఏడూ కొండలు కేవలం అద్రులు (కొండలు )మాత్రమె కాదు వాటి వెనుక కొన్ని గాధలు వున్నాయి. అవి

1. వృషభాద్రి ; 💐
పూర్వం వృషభాసురుడు అనే శివ భక్తుడు భల గర్వితుడై సాక్షాత్ శ్రీహరితోనే యుద్దానికి తలపడ్డాడు . యుద్ధం లో చావుతప్పదని గ్రహించిన రక్కసుడు "తమ చేతిలో మరణించడం నా మహద్భాగ్యం మీరు వున్న ఈ పర్వతానికి నా పేరు ప్రసాదించవలసింది "అని శ్రీహరిని వేడుకున్నాడు . స్వామీ కరుణించి అతడు కోరిన వరాన్ని ఇచ్చి తరువాత వ్రుశాభాసురుడిని సంహరించాడు . ఆ ప్రకారం గా వృషభాద్రి అను పేరు వచ్చినది .
2. నీలాధ్రి ;💐
స్వామీ వారికి తొలిసారిగా తన తల నీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంభరి. ఆమె భక్తి కి మెచ్చిన వేంకటేశ్వరుడు ఏడూ కొనదలలో ఒక కొండ కి ఆమె పేరుగా పేరుని పెట్టారు .
3. గరుడాద్రి;💐
శ్రీ మహా విష్ణువు హిరణ్యాక్షుని సంహరించిన తరువాత గరుత్మంతుని పిలిచి తన క్రీడాద్రిని తీసుకు రమ్మని ఆదేశిస్తాడు . ఆ ఆజ్ఞ మేరకు గరత్మంతుడు దానిని తెచ్చినందువల్లె అది గరుడాద్రి గా ప్రసిద్ది చెందింది .
4. అంజనాద్రి ; 💐
సంతానం కోసం అంజనా దేవి వెంకటాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది . తానితో ఆమె గర్భాన్ని దాల్చి అనంత బలశాలి,చిరంజీవి అయిన ఆంజనేయుడికి జన్మ నిచ్చింది . అందుకే ఈ పర్వతం అంజనాద్రి గా ప్రసిద్ది పొందింది .
5. నారాయణాద్రి ; 💐
నారాయణుడు అనే భక్తుడు స్వామీ పుష్కరిణి తీరాన తపస్సు చేయడంతో అతడి పేరు మీదగా ఈ పర్వతం నారాయణాద్రి గా ఖ్యాతి పొందింది .
6. వేంకటాద్రి ; 💐
వేం అనగా సమస్త పాపాలనుకటః అనగా దహించునది అంటే పాప రాశులను భస్మం చేసేది కావున ఈ క్షేత్రానికి వెంకటాచలం అని పేరు వచ్చింది .
7. శేషాద్రి ; 💐
ఓ సారి ఆది శేషుడికి వాయు దేవునికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం రేగింది . "నీకు శక్తి వుంటే నన్ను కదుల్చు "అంటూ ఆదిశేషుడు వెంకటాచలాన్ని చుట్టుకున్నాడు . వాయు దేవుడు అతడిని వేసిరి వేయగా పర్వతం తో పాటు ఎక్కడ వచ్చి పడతాడు . ఓడిపోయినా భాదతో వున్నా ఆది శేషుడిని వెంకటేశ్వరస్వామి ఓదార్చుతూ ,"నిన్ను ఆభరణం గా ధరిస్తాను . నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ది పొందుతుంది అని వరం ఇచ్చాడు . దానితో ఈ కొండ శేషాద్రి గా ప్రసిద్ది పొందింది . ఈ విధం గా ఏడూ కొండలు ఏర్పడి స్వామీ వారు వాటి మీద వసిస్తూ సదా తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ కలియుగ దైవం గా ప్రసిద్ది పొందాడు . 💖
20

🌹 భక్తుడి తపస్సుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యాడు...🙏🌹

devi.jpeg భక్తుడి తపస్సుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యాడు...🙏
దేవుడు ఏమి వరం కావాలి భక్తా . . . ?
భక్తుడుఈ ప్రపంచం లో ఉన్న వాళ్ళందరకు ఒక్కొక్కరికి 100 కోట్లు ఇవ్వండి!
. దేవుడుఒకే ఇస్తాను. అలా వచ్చిన డబ్బుతో ఏమి చేస్తావు . . . ?
భక్తుడు డబ్బు వుంటే ఏదైనా చెయ్యొచ్చు. ముందుగా ఒక ఇల్లు కట్టుకొంటాను.
దేవుడు ఎవరు కడతారు . . . ?
భక్తుడు ఎవరేమిటి డబ్బు పారేస్తే ఈ వూళ్ళో ఎవరినా కడతారు
. దేవుడుఎవరికీ పారేస్తావు . . . ?
వాళ్ళ దగ్గర కుడా 100 కోట్లు డబ్బు ఉంటుంది కదా, వాళ్ళే నీకు పారేస్తారు ఇల్లు కట్టివ్విమని.
భక్తుడు ఈ ఊళ్ళో ఎవరు కట్టకపోతే ప్రక్క ఊరినుంచి కూలిలను తెప్పిస్తాను ఎక్కువ డబ్బు ఇచ్చి.
దేవుడు ఆ పక్క ఊరిలో వాళ్ళందరి దగ్గర కుడా 100 కోట్లు వుంటాయి కదా . . . ?
భక్తుడు ఎవరు కట్టటానికి ముందుకు రాకపోతే మంచి కట్టిన ఇంటినే కొంటాను నాకు డబ్బుకు లోటు లేదు కదా.
దేవుడు ఎవరు అమ్ముతారు . . . ?
ఎవరికీ డబ్బు అవసరం ఉంటుంది . . . ?
అందరి దగ్గర 100 కోట్లు వుంటాయి కదా . . . ?
భక్తుడు సరే ఇదే పాకలో ఉంటాను. రోజు మంచి తిండి తింటాను.
. దేవుడు* = ఎక్కడా . . . ?
భక్తుడు* = ఈ వూళ్ళో అనేక హోటల్ వున్నాయి తిండికి లోటేమిటి ?
. దేవుడుఎవరు వండుతారు . . . ?
భక్తుడు హోటల్ కాకపొతే మంచి బియ్యం కొనుక్కొంటాం !
. దేవుడు ఎవరు పండిస్తారు . . . ?
అందరి దగ్గరా డబ్బులు వుంటాయి కదా . . . ?భక్తుడుఅసలు నీ ఉదేశ్యం ఏమిటి స్వామి . . . ?
దేవుడుఅందరి దగ్గరా అవసరానికి మించి డబ్బులు వున్నప్పుడు ఎవరు మాత్రం కష్టపడతారు ? అందరు కూర్చొని తిన్దామనుకొంటారు కదా
భక్తుడునిజమే సామి నాకు అర్ధం అయ్యింది.
దేవుడు అందుకే కష్టే ఫలి అన్నారు.కష్టానికి తగ్గ ఫలితమే రావాలి కాని అంతకు మించి వస్తే అనర్ధమే.
భక్తుడుసామీ నా కళ్ళు తెరిపించావు . . .
నాకు ఒక్కడికే 100 కోట్లు ఇవ్వు సామి . . . ! ఇంకెవరికి ఇవ్వకు . . .!
. దేవుడు = మీరు మారరురా . . . ! మారరు గాక మారరు 🙏 💖
19

🌹 *హృదయార్పణం*🌹

elephant.jpeg *హృదయార్పణం*
ఒక మంచి విషయం..... దయచేసి ఒకసారి ఈ వ్యాసం చదవండి! *మనిషి తనకు మానవజన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు....* పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో సమర్పించుకుంటూ ఉంటాడు. ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమోగానీ, అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా? ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు. భగవంతుడిదే ఆ యావత్‌సృష్టి. అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే. కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు. పూర్వం ఒక యోగి భగవంతుణ్ని అర్చించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది. పూజలో ఒక్కొక్క ఉపచారాన్నీ చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు- 'పరమేశ్వరా! నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు. కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలి? అన్నింటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి? నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లెందుకు? పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా? నిత్యనిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి? ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి? గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అవసరమా? ఏ లేపనాలూ అవసరం లేని నీకు గంధం ఎలా పూయాలి? నిత్య పరిమళుడవైన నీకు పూలు పెట్టడం ఎందుకు? మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు తొడగాలా? నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరి అయినదేనా? జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా? నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు? విశ్వానికే ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తిపరచగలనా? అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి? అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి? వేదాలే నిన్ను స్తుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్తుతించాలి?' ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు. భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యల్పుడే. వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణనలోకి రానే రాదు. అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది. నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు. వస్తువులు అంతకన్నా కావు. ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరతాడు. భక్తితో స్మరిస్తే చాలునంటాడు. కానీ మనిషి మనసు చంచలం. చపలం. స్థిరంగా ఒకచోట ఉండదు. లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు. అందుకే....... శంకరభగవత్పాదులు- 'ఓ పరమేశ్వరా! నా మనసు ఒక కోతి వంటిది. అది ఎప్పుడూ సంసారవాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది. భార్యాపుత్రుల ప్రేమ అనే చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది. అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను. దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకో' అని ప్రార్థిస్తారు. సామాన్య భక్తులను తరింపజేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది. 'ఓ పరమేశ్వరా! బంగారుకొండ మేరుపర్వతమే నీ చేతిలో ఉంది. అపార ధనవంతుడైన కుబేరుడు నీ పాదదాసుడై ఉన్నాడు. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి. షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు. సమస్త మంగళాలనూ కలిగించే పార్వతీదేవి సర్వమంగళయై నీ పక్కనే ఉంది. కనుక నీకు నేనేమీ ఇవ్వలేను. నా దగ్గర ఉన్నది ఒక్క మనసే. అది నీకు సమర్పిస్తున్నాను!' అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు. అచంచల విశ్వాసం, అకుంఠిత భక్తి, అన్నింటినీ నివేదించగల మనసు ఉంటే చాలు. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా పూజల్ని అందుకుంటాడు. అట్టహాసాలు, ఆర్భాటాలు నిజమైన పూజలు కావు. హృదయార్పణమే పూజ. నిశ్చల ధ్యానమే భక్తి. *అంతేకానీ లోకమంతా చూడాలని చేసే నటనలు పూజలు కావు. ఈ సత్యాన్ని మనిషి గ్రహిస్తే మేలు! *లోకాస్సమస్తా సుఖినోభవంతు* 💖
18

🌹 మన బలం 🌹

elephant.jpeg ఒక గుడిలో ఊరేగింపుకోసం ఒక ఏనుగును ఉపయోగించేవారు.ఆ ఏనుగు ఒకరోజు శుభ్రంగా స్నానమాచరించి రోడ్డు ప్రక్కగా నడుచుకుంటూ వస్తోంది. దానికి ఎదురుగా ఋరదలో పొర్లి పొర్లి ఒక పంది వస్తోంది... ఆ పంది తన తోకను ఆడిస్తూ వచ్చి పోయే వారిమీద బురదపడేలా నడుస్తోంది. ఏనుగు ఆ పందిని చూసి దూరంగా నడవసాగింది. తనను చూసి ప్రక్కకు వెళ్ళడం గమనించిన పంది మరో పందితో ఇలా అంటుంది, "చూసావా ఆ ఏనుగు నన్ను చూసి భయపడి ప్రక్కకు తప్పుకుంటోంది" అని #గర్వంగా చెప్పింది... ఆ మాటలు విన్న మరో ఏనుగు ఈ ఏనుగును ఇలా అడిగింది, "నువ్వు నిజంగానే పందిని చూసి భయపడ్డావా?" అని. గుడికి వెళ్తున్న ఏనుగు ఇలా సమాధానం చెప్పింది.. "నా కాలితో తొక్కితే ఆ పంది నుజ్జునుజ్జు అవుతుంది. దానికి నేను భయపడటమా..? నేను #ఒదిగి ప్రక్కకు వచ్చింది దాని మీద ఉన్న బురద నామీద పడితే నేను అశుద్దం అవుతాను. నేను ఎంతో భక్తిశ్రద్ధలతో నా స్వామి సేవకు వెళ్తున్నాను.. బుద్దిలేని పంది గురించి పట్టించుకుంటూ కోపంతెచ్చుకుని నా భక్తి, నిష్టలను పక్కకు తప్పించలేను" అని చెప్పింది 💗🐘💗
💖 #నీతి:- మన బలం ఏవిటో మనకు తెలిస్తే చాలు. ఇతరులు ఎలా మాట్లాడినా పట్టించుకోకూడదు 💖
17

🌹 *తప్పులెన్నువారు!!!*🌹

శివాలయానికి సేవ చేయడం వలన కలిగే విశేష ఫల *పరనింద మానవ స్వభావంలో సర్వసాధారణ లక్షణం. తప్పులుగా తమకు తోచేవి ఎదుటి వ్యక్తిలో కనపడినప్పుడు, ఆ మనిషిలో మరెన్ని మంచి గుణాలున్నా, ఆ తప్పులనే పట్టిచూపిస్తుంటారు కొంతమంది.*
*తప్పులుగా వాటిని అతడు అంగీకరించక ప్రతిస్పందిస్తే, చులకనగా చూడటమే కాక, అపరాధిగా ముద్ర వేయడానికైనా వెనకాడరు.*
*మనిషి ఎప్పుడూ తప్పులే చేయడా? మరొకరి తప్పులపై తనకంత ఆసక్తి ఎందుకని? ఇలా ఆత్మవిమర్శ చేసుకునేందుకు కొందరు అవకాశమివ్వరు.*
*సర్వం విష్ణుమయమన్నప్పుడు భగవంతుడి సృష్టిలో తప్పులెలా ఉంటాయన్న పరమ భావన మహాత్ముల్లోనే కనిపిస్తుంది.*
*గీతలో కర్మయోగం, తప్పొప్పులను విభజించి భగవంతుడు మనిషికిచ్చినదేమీ లేదని, అవి రెండూ అతడి కర్మాచరణల ఫలితాలని అంటుంది.*
*ధర్మశాస్త్రాలన్నీ అతడిని, తన అహంభావనలతోనే అవి నిర్ణయించి నిర్దేశించే న్యాయాధికారివి కావద్దంటాయి. *
*అదే వాస్తవాన్ని, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని, వేమన శతకంలోని ఒక చిన్న పద్యపాదం అతడికి చిరకాలం జ్ఞాపకం ఉండేలా చెబుతుంది.*
*ఇటాలియన్‌ మేధావి లియొనార్డో ఒకరిలో తప్పులుగా కనిపించేవి, భూతద్దాల్లో పెద్దవిగా చేసి చూపించి ప్రపంచాన్ని ఉద్ధరించాలని మనుషులనుకుంటే అది చవకబారు ప్రయత్నమంటాడు, దాన్ని మానుకొమ్మంటాడు.*
*తప్పు మీద తప్పు చేసుకుపోతున్న శిశుపాలుడు అతడు నూరు తప్పులు చేసేదాకా కృష్ణపరమాత్ముడు ఉపేక్షించి ఊరుకున్నాడు.*
*ఆతరవాతనే అతడిని సంహరించాడు. *
*తప్పు చేసే వ్యక్తికి తగినన్ని అవకాశాలిచ్చికానీ భగవంతుడు శిక్షించడని చెప్పే పురాణ గాథల అంతరార్థం అదేనని మనుషులు గ్రహించరు.*
*తప్పు చేసినప్పుడు చేసిన వాడికది తప్పని చెప్పి సరిదిద్దుకొమ్మని ఒప్పించగల కుశలత కలిగినవాడు గొప్పవాడు.*
*గౌతమ బుద్ధుడు అటువంటి మార్గదర్శకుడు.*
*కరడుగట్టిన బందిపోటు అంగుళీమాలుడి దోషభూయిష్ఠమైన ప్రవర్తనలో గుణాత్మకమైన పరివర్తనకు కారణమై ఆయన అతడిని తనకు ప్రధాన శిష్యుడయ్యే స్థాయికి చేర్చాడు.*
*తప్పులు చేసేవారికి తమ తప్పులు తెలుసుకునేందుకు భగవంతుడే సమయం ఇస్తున్నప్పుడు, సాటి మనిషి తప్పులపై అంత తొందరగా స్పందించవలసిన అగత్యం తమకేమిటని మనుషులు ఆలోచించరు. నిందారోపణలు చేస్తూ జీవించే మనిషి నిజ జీవితంలో ఎన్నటికీ విజేత కాలేడు.*
*భగవంతుడు మనుషులందరినీ దోష రహితులుగా, సమగ్రత తొణికిసలాడే పరిపూర్ణులుగా సృష్టించలేదు. తప్పులు చేయవద్దని, అవి జరగకుండా చూసుకొమ్మని మనిషి మరో మనిషికి చెప్పడం ధర్మవిరుద్ధం కాదు.*
*చేసిన తప్పు తెలియజెబుతున్నప్పుడు, తప్పు చేసిన వ్యక్తికి అది తనపై ప్రేమాభిమానాలతో, సదుద్దేశంతో జరిగిన ప్రయత్నంగా అనిపించాలి. యుక్తాయుక్తాలు నిర్ణయించే అధికారి తానన్న భావన అతడికి కలిగిస్తూ, తప్పులు సరిదిద్దాలనుకుంటే- ఈ ప్రపంచంలో అతడు ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదముంటుంది.* 🌺🌼🌺
16

🌹శివాలయానికి సేవ చేయడం వలన కలిగే విశేష ఫలితాలు!!🌹

శివాలయానికి సేవ చేయడం వలన కలిగే విశేష ఫల శివాలయానికి సేవ చేయడం వలన కలిగే విశేష ఫలితాలు!! 🔱
శివాలయం రోజూగానీ, వారానికోసారి కానీ, ఏదైనా పండుగలు, ఉత్సవాలు జరిగే సమయంలో ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తాం. ఏవైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకుంటాం. అక్కడ విశేషమైన ఆర్జిత సేవలు జరిపించుకుంటాం. అవకాశాన్ని బట్టి అక్కడి ఇతర ఆలయాలను, సందర్శనీయ స్థలాలను దర్శిస్తాం. క్షేత్రంలో నిద్రచేస్తాం. అంతవరకే చాలా మందికి తెలిసిన విషయం. భక్తులకు తెలియాల్సిన మరో విషయం ఏంటంటే ఆలయంలో ఎన్నో సేవలను మనం స్వచ్ఛందంగా నిర్వహించవచ్చు. అలా చేస్తే కలిగే ఫలితం చాలా విశేషంగా చెప్పబడింది. శివాలయం నిర్మాణం చేస్తే.. నిర్వహణ చేస్తే.. పునరుద్ధరణ చేస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో దానితో సమానమైన ఫలితాలు శివాలయ సేవ ద్వారా పొందవచ్చని శివధర్మశాస్త్రంలో వివరించబడింది. దర్శిస్తే చాలు... దూరతః శిఖరం దృష్ట్వా నమస్కుర్యాచ్ఛివాలయమ్ | సప్తజన్మకృతం పాపం క్షిప్రమేవ వినశ్యతి || దూరం నుండి ఆలయశిఖరాన్ని దర్శించిన వెంటనే నమస్కరించాలి. అలా చేస్తే ఏడుజన్మలలో తాను చేసిన పాపాలనుండి వెంటనే విముక్తుడౌతాడు. 🔱 పరిశుభ్రం చేస్తే... 🔱 పశ్యన్ పరిహరన్ జంతూన్ మార్జన్యా మృదుసూక్ష్మయా | శనైస్సమ్మార్జనం కుర్యాత్ చాంద్రాయణఫలం లభేత్ || శివాలయానికి వెళ్లిన భక్తులు అక్కడ ఏవైనా ప్రాణులు, పశువులు తిరుగుతుంటే వాటిని హింసించకుండా బయటకు పంపి మెత్తటి మార్జని (చీపురు)తో ఆలయాన్ని తుడిచి పరిశుభ్రం చేస్తే చాంద్రాయణ వ్రతం ఆచరించిన ఫలితం కలుగుతుంది. 🔱 ఆవు పేడతో అలికితే... 🔱 ఆవు పేడతో ఆలయాన్ని శుభ్రంగా అలికితే కూడా ఎంతో ఫలితం ఉందని చెప్పబడుతోంది. ఆ ఆవు పేడను మంచి ఆవుల నుండి సేకరించాలి. తన ఇంటినుంచి తీసుకురావాలి. లేదా పవిత్రమైన చోటునుండి తేవచ్చు. ఆ గోమయాన్ని కూడా పైభాగం, కిందభాగం వదిలి మధ్యలో శుద్ధం, మలినం కాని ఆవుపేడనే తీసుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాంటి గోమయంతో శివాలయ పరిసర ప్రాంతాన్ని చక్కగా అలికితే తమ పూర్వీకులు తరించి గోలోకం చేరుకుంటారు. అంతేకాక అలా చేస్తే సిరిసంపదలతో తులతూగుతారు. 🔱 నీటితో శుభ్రపరిస్తే.... 🔱 యః కుర్యాత్ సర్వకార్యాణి వస్త్రపూతేన వారిణా | స ముని స్స మహాసాధు స్స యోగీ స శివం ప్రజేత్ || వస్త్రంతో వడగట్టిన నీటితో ఆలయాన్ని పరిశుభ్రం చేసినవారు సజ్జనులు. అతడు యోగియై శివుని చేరుకుంటాడు. అలాగే శివాలయం నేలను అద్దంలా.. అంటే నేలవైపు చూస్తే, తన ప్రతిబింబం కనపడేలా తుడిచినా ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది. 🔱 పూలతో అలంకరిస్తే... 🔱 యావద్ధస్తా భవే ద్భూమిః సమన్తా దుపశోభితా తావద్యుగసహస్రాణి రుద్రలోకే మహీయతే శివాలయాన్ని రకరకాల పుష్పాలతో అలంకరించినా.. అందంగా తీర్చిదిద్దినా... ఎంత ప్రదేశం తీర్చిదిద్దాడో దాన్ని అంగుళాలతో కొలిచి అంతకాలం రుద్రలోకంలో నివసిస్తారని చెప్పబడుతోంది. పుష్పవనాలను పాదుగొల్పినా... శివలోకం చేరతాడు. 🔱 శివరూపాలను చిత్రిస్తే.... 🔱 యావంతి రుద్రరూపాణి స్వరూపాణ్యపి లేఖయేత్ | తావద్యుగసహస్రాణి రుద్రలోకే మహీయతే || చిత్రకారులను రప్పించి వారితో శివాలయంలో వేదపురాణాలలో పేర్కొనబడిన శివుని అవతారాలు, లీలలకు సంబంధించిన చిత్రాలు వేయించాలి. అలా ఎన్ని బొమ్మలు చిత్రిస్తారో అంతకాలం రుద్రకాలంలో గొప్పగా ప్రకాశిస్తారు. 🔱 వెల్ల వేయిస్తే... 🔱 సుధావిలిప్తం యః కుర్యాత్ సర్వయత్నైశ్శివాలయమ్ | తావత్పుణ్యం భవేత్ సోపి యావదాయతనే కృతే || శివాలయానికి, ప్రాకారం గోడలకు సుధాకర్మ (సున్నం పూయించడం) చేయించినవారికి ఆలయనిర్మాణం చేసిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం విడువకుండా, పాలవంటి తెల్లసున్నంతో లేదా వేరే రంగులతో అందంగా వెల్లవేయించినా అతడికి శివలోకవాసపుణ్యం లభిస్తుంది. అలాగే ఆలయంలోని గోడలకు సుగంధాలు పూయడం, గుగ్గిలంతో ధూపం వేయడం, చక్కగా రంగురంగుల ముగ్గులు పెట్టడం, పూలతోటలను బాగుచేయడం, ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తీసివేయడం, దీపాలకు కావాల్సిన వత్తులను సిద్ధం చేయడం, తోటి భక్తులకు సాయం చేయడం, ఆలయంలో భక్తులకు మంచినీరు ఇవ్వడం, ప్రసాదవితరణ ఇలా ఎన్నో సేవలను భక్తులు ఆచరించవచ్చు. ఈ అవకాశం మనం గ్రామాల్లో ఉండే ఎన్నో ఆలయాల్లో మనం నిర్వహించుకుంటే ప్రతీ దేవాలయం దివ్యమైన భవ్యమైన శోభతో అలరారుతుంది. భక్తులకూ కల్పవృక్షమై నిలుస్తుంది. 🌺🌼🌺
15

🌹 👉 నేటి జీవిత సత్యం.
👉 మరణం అంటే ఏమిటి
🌹

దేవాలయం లో ప్రవేశించగానే చేయవలసిన నియమ 👉 నేటి జీవిత సత్యం.
👉 మరణం అంటే ఏమిటి
*'ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైనదేది' అన్నది యక్షుడి ప్రశ్న. 'నిత్యం అనేకమంది తన కళ్ళముందే చనిపోతున్నా తాను మాత్రం చిరంజీవినని అనుకుంటూంటాడు మనిషి. ఇంతకన్న ఆశ్చర్యం ఇంకేముంటుంది' అంటూ బదులిస్తాడు యుధిష్ఠిరుడు.* *ప్రతి మనిషికీ మరణం తప్పదు. అయినా తాను మాత్రం శాశ్వతంగా బతకబోతున్నట్టు ప్రవర్తిస్తుంటాడు. తనకేదో రోజున హఠాత్తుగా రాబోయే మరణం గురించి తెలుసుకోవటానికి మనిషికి క్షణం కూడా తీరికలేదు.* *మనిషికి తన పుట్టుక గురించి తెలుసు. కాని, మరణం** *గురించి బొత్తిగా తెలియదు. దాన్నించి తప్పించుకోవటం అసంభవమనీ తలంచడు.* *చనిపోయాక ఏమవుతుంది,* *మరణం తరవాత మనిషి ఎక్కడికి వెడతాడు, అసలు మానవ జన్మకు* *ప్రయోజనమేమిటి, ఆత్మ అన్నది ఉన్నదా, శరీరాన్ని వదిలేశాక ఆత్మ ఎక్కడికి వెడుతుంది....* *జీవితం మీద జిజ్ఞాస ఉన్న ప్రతి మనిషికీ ఎదురయ్యే ప్రశ్నలివి. జీవించటంలో మునిగిపోయి ఈ ప్రశ్నలకు జవాబుల గురించి అన్వేషించడు. చివరికి ప్రాణాంతకమైన జబ్బుచేసినా, ఆఖరి క్షణాలు ఆసన్నమవుతున్నా- ఇంకా జీవితాన్ని ఎలా పొడిగించాలా అన్న ఆలోచనే తప్ప, జన్మాంతర జీవితం గురించి తలంచడు.* *వాస్తవంగా తల్లి గర్భంలో పడినప్పటినుంచి మరణంవైపు మనిషి ప్రయాణం ఒక్కొక్క అడుగే సాగుతూంటుంది. ఓ క్షణం ముందుకు నడుస్తోందంటే ఆయుష్షులో ఓ క్షణం తరిగిపోతున్నట్టే కదా! బ్రహ్మ జ్ఞానులకు ఇది అసంబద్ధమనిపించదు. ఎందుకంటే, మరణానంతర జీవితం గురించి మన వేదాలు ఘోషిస్తున్నాయి కనుక. ఈ జీవితం ఎంత ముఖ్యమో, ఆ జీవితమూ అంతే అవసరం !* *కొన్ని మతాలు మరణానంతర జీవితం గురించి భయపెడుతుంటాయి. జీవితం ఎంత స్వేచ్ఛాసుఖాలతో అనుభవించవచ్చో మరణం కూడా అంత స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో ముగించవచ్చని మన వేదాలు చెబుతున్నాయి.* *కొందరు మతస్తులు మనిషికి ఒకే జన్మ ఉంటుందని, మానవ జన్మ తక్కువ సమయంలో ముగిసిపోతుంది కనుక వస్తు రూపేణా దొరికే సుఖాలన్నీ ఈ జన్మలోనే తనివి తీరా అనుభవించేయాలని బోధిస్తారు. మనిషికొకే జన్మ అని అనుకోవటంలో ప్రమాదమే అది. రేపో, ఎల్లుండో ఎలాగా పోతాం కనుక త్వరత్వరగా అన్నీ అనుభవించేయాలని పిచ్చి పరుగులు పెడుతుంటారు వాళ్ళు.* *వేద పరిజ్ఞానమున్నవారిని మరణం భయపెట్టదు. వస్తురూపంగా చవిచూసే గుణాలకన్న మానసికంగా దొరికే ఆనందమే వారికి ముఖ్యం. జీవితం దారి జీవితానిదే! మరణం దారి మరణానిదే! మరణం జీవితానికి ఆఖరిమెట్టు. ఆత్మ జీవితం అనంత వాహిని. ఒక జన్మ ఆత్మ వేసుకునే వస్త్రం మాత్రమే! ఆత్మకు చావులేదు* . *భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 'అర్జునా! ప్రతి దేహంలో నివసించే దేహి లేక ఆత్మ నిత్యుడు. అవధ్యుడు. మరణమనగా దేహంనుంచి దేహి బయటికి వెళ్ళడం. దేహం ధరించే వస్త్రం లాంటిది. ఈ రెండింటి సంయోగం క్షణికమే! పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరించటం వంటిదే! ఆత్మ తన పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ఆశ్రయిస్తుంది' అని స్పష్టంగా చెప్పాడు.* *ఏదో క్షణంలో ఈ జీవితం ముగిసిపోవచ్చు. ఈ ప్రశ్నలకు జవాబులు దొరక్కుండానే సమయం అంతం అయిపోవచ్చు. అందుకే, వస్తువుల ద్వారా దొరికే సుఖసౌఖ్యాలన్నీ కేవలం తాత్కాలికమేనని, శాశ్వతంగా లభించే ఆనందం వేరే ఉందని మనసులో జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి. అప్పుడే ఈ మానవ జన్మకు ముక్తిమార్గం లభ్యమవుతుంది. దివ్యజ్ఞానం దక్కుతుంది. ఈ ఆత్మ పరమాత్మకెంతో దగ్గరని అర్థమవుతుంది.* సేకరణ. మానస సరోవరం 🙏 🌺🌼🌺
14

🌹అసలైన పూజ🌹

దేవాలయం లో ప్రవేశించగానే చేయవలసిన నియమ అష్టోత్తరాలు, సహస్ర నామార్చనలు, పంచామృతాభిషేకాలు, పుష్పాలంకరణలు, షడ్రసోపేతమైన పదార్థాల నివేదనలు- ఇవన్నీ దైవకృప సాధించడానికి ఉపకరిస్తాయని భావిస్తుంటారు. పరమాత్ముడు నిజంగా వీటికే సంతృప్తి చెందుతాడా? దైవభక్తి అంటే ఇదేనా? భక్తుల నుంచి భగవంతుడు ఆశించేదేమిటి, భగవంతుడికి ప్రియమైన భక్తులెవరు? బుద్ధిగతంగా, ఆత్మశుద్ధితో తమను తాము ఉద్ధరించుకుంటూ నిత్య చైతన్య స్వరూపులుగా మసలుకునేవారే దైవానికి ఇష్టమైనవారని గీతాసందేశం. దయగల హృదయమే పూజామందిరం. కరుణ నిండిన మనసే ప్రేమానురాగాల కలువల కొలను. మానవతా పరిమళాలు గుబాళించాలంటే మదిని మల్లెల తోటగా మలచుకోవాలి. ‘జీవితంలో మధురిమల్ని ఆస్వాదించాలనుకుంటున్నావా? అయితే నీ దృష్టిని ఆధ్యాత్మికత వైపు మళ్లించు. అద్భుతమైన ఫలితాన్ని గమనించు’ అని వివేకానందుడు సూచించారు. జరుగుతున్న దానిపట్ల ఎరుక కలిగిఉంటూ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ జీవించడమే ఆధ్యాత్మికత. మనసును దైవంతో, వాక్కును ప్రియ సంభాషణలతో, కర్తవ్యాల్ని ధర్మకార్యాలతో మమేకం చేసిన వ్యక్తులే దేవుడి కొలువు కూటమిలో ముందువరసలో ఉంటారని ఆదిశంకరుల ప్రబోధం. ‘నిన్ను నువ్వు తెలుసుకో... తెలివిగా మసలుకో’ ఇదే నా ఉపదేశసారం అని రమణ మహర్షి ఆధ్యాత్మిక రహస్యాన్ని వెల్లడించారు. హృదయంలో అరిషడ్వర్గాలు, రాగద్వేషాలు, ప్రతికూల ఆలోచనలనే గాఢమైన చీకట్లు ఉంటే పరమాత్మ చూపు మనపై ఎలా ప్రసరిస్తుంది? శరీరాన్ని శుద్ధజలంతో పరిశుభ్రం చేసుకోవచ్ఛు కానీ, అంతరింద్రియమైన మనసును శుభ్రం చేయడమెలా? సత్వగుణాలతో, ఆధ్యాత్మిక చింతనతో, రుజువర్తనతో మనసును నిరంతరం ప్రక్షాళన చేస్తుండాలి. ఆత్మవిద్యలో, సాధుజీవనమనే తపస్సుతో మనసు సదా నిర్మలంగా ఉంటుందని భాగవతం ఈ విషయాన్ని ప్రస్తావించింది. యోగసాధన, ఆత్మశోధన ద్వారా జీవుడు అమృత స్థితిని సాధించవచ్ఛు ‘అసంపూర్ణత్వం నుంచి పూర్ణత్వం, సంకుచితత్వం నుంచి అనంతత్త్వం, మృత్యువు నుంచి అమృతత్వాన్ని అందుకోవడానికి భౌతిక, ప్రాణిక, మానసిక స్వభావాలతో పరివర్తన జరగాలి’ అనేది అరవిందయోగి సూచించిన దివ్యమార్గం. ఏ మనసు నిరంతరం జ్ఞానాన్వేషణలో నిమగ్నమవుతుందో, ఏ హృదయంలో హితకరమైన ఆలోచనలు పరిఢవిల్లుతాయో, అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ శుభకరమైన సంకల్పాలు చేస్తారు. మనసు చేసే సంకల్పాలన్నీ కల్యాణదాయకంగా ఉండాలని యజుర్వేదం ఆక్షాంక్షించింది. కపటత్వాన్ని కాదు, కల్మషంలేని మంచి పనులనే భగవంతుడు హర్షిస్తాడు. ప్రపంచానికి ఉపయుక్తమైన రీతిలో జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆధ్యాత్మికత నిర్దేశిస్తుంది. ధైర్యవంతులు నడిచే రాచబాట ఆధ్యాత్మికత. గడ్డిమొక్క త్వరగా విస్తరించి వేళ్లూనుకుంటుంది. అదే మామిడి మొక్క వృక్షంగా ఎదిగి, మధుర ఫలాల్ని అందించడానికి నియమిత సమయాన్ని తీసుకుంటుంది. సహనమే మన సంస్కృతి. ఆధ్యాత్మికత అభ్యున్నతి సాధించడానికి సహనశీలత అవసరం. నిర్మలభక్తి సాధనకు నిత్యం కృషి చేయాలి. భక్తి, ఆధ్యాత్మికతల వల్ల హృదయ కమలం విస్ఫారితమవుతుంది. ఆ పుష్పాన్ని భగవదర్పితం చేయడమే అసలైన పుష్పార్చన. హృదయంలో ఉప్పొంగే దయామృతాన్ని దీనులపట్ల జాలువార్చడమే దైవానికి అమృతాభిషేకం. సత్కర్మల ద్వారా చేకూరే ఫలితాన్ని దైవానుగ్రహంగా భావించడమే భక్తి నివేదన. జీవితాన్ని వెలుగు తరంగంగా, ఆనందోత్సవంగా మార్చుకోవడానికి ఆధ్యాత్మిక జ్యోతే మార్గ దర్శనం!! శ్రీ భక్తి తత్వం 🌺🌼🌺
13

🌹విచిత్ర వినాయక దేవాలయము🌹

విచిత్ర వినాయక  దేవాలయము విచిత్ర వినాయక దేవాలయము తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా...పిట్ట కొంచం కూత ఘనం అన్నట్టు, ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలం(జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం. అతిశయ వినాయగర్ ఆలయంలో మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.., నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.., వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు.
చారిత్రక ప్రాశస్త్యం*
ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది. 🙏🏻*జై గణేశా..!* 🙏🏻 🌺🌼🌺
12

🌹తరతరాలుగా మనం వింటున్న , క్రమంగా మరచి పోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు. . 🌹

దేవాలయం లో ప్రవేశించగానే చేయవలసిన నియమ తరతరాలుగా మనం వింటున్న , క్రమంగా మరచి పోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు. .

1. సోమ వారం తలకు నూనె రాయరాదు.
2. ఒంటి కాలీపై నిలబడ రాదు
3. మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు
4. శుక్రవారం నాడు కొడలిని పుట్టినింటికి పంప రాదు
5. గుమ్మడి కాయ ముక్కలనే ఇంటికి తేవాలీ
6. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు
7. మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు
8. సూర్యాస్తమయం తరువాత కసవువూడ్చరాదు, తల దువ్వ రాదు
9. పెరుగును ఉప్పును అప్పు ఈయరాదు
10. వేడి వేడి అన్నం లోనికి పెరుగు వేసుకోరాడు
11. భోజనం మధ్యలో లేచి పోరాదు
12. తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు
13. గడపపై పాదం పెట్టి వెళ్లరాదు
14. ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు కసవూడ్చరాదు
15. గోడలకు పాదం ఆనించి పడుకో రాదు
16. రాత్రీ వేళలో బట్టలుతక రాదు
17. విరిగిన గాజులు వేసుకోరాడు
18. నిద్ర లేచిన తరువాత పడుకున్న ఛాపను మడిచి పెట్టాలి
19. చేతి గోళ్ళను కొరకరాడు
20. అన్న తమ్ముడు, తండ్రి కొడుకు ఒకే సారి క్షవరం చేయించుకోరాడు
21. ఒంటి (సింగల్) అరిటాకును తేరాదు
22. సూర్యాస్తమయం వేళలో నిద్ర పోరాదు
23. భోజనం తరువాత చతిని ఎండ పెట్టవద్దు
24. కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను మరచిపోరాదు
25. ఇంటి గడపపై కూర్చోరాదు
26. తిన్న తక్షణమే పడుకోరాదు
27. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని / కాళ్ళు చాపుకుని కూర్చోరాదు
28. చేతులు కడిన పిమ్మట ఝాడించ రాదు
29. రాత్రి భోజనం తరువాత పళ్ళెం కడుక్కోవాలి
30. ఎంగిలీ చేతితో వడ్డించరాదు
31. అన్నం, కూర చారు వండిన పాత్రలలో తినరాదు
32. సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు
33. ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకు, ముత్తైదువలకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు
34. చిరిగిన అంగీలు, బనియన్లు తదితర లో దుస్తులను ధరించరాదు
35. ఇంటి లోపలికి చెప్పులు Shoes ధరించి రారాదు
36. దేవాలయాలలో చెప్పులు పోతే మరచిపొండీ. వేరే వాళ్ళది వేసుకొస్తే దారిన పోయే దరీద్రాన్ని ఇంటికి తెచ్చినట్టే.
37. చిన్న జంతువులకు (కుక్కలు, దూడలు లాంటివి) పాచిపోయిన పదార్థాలు పెట్టకండి
38. ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించ రాదు
39. ప్రయాణాల్లో అపరిచితులనుండి పానీయాలు, తీడి పదార్థాలు తీసుకోవద్దు.
40. శనివారం ఉప్పు, నూనె కొని తేరాదు
41. అనవసరంగా కొత్త చెప్పులను కోనరాదు
42. ఇంటిలో వాడకుండా పడివున్న గోడ గడియారాలు, వాచీలు, సైకిళ్ళ, కుట్టు మెషిన్లు లాంటివి వదిలించుకోవాలి
43. భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు కాకండి. మీకు రావలసివుంటే అవే వస్తాయి.
44. అర్హులకు మాత్రమే గుప్త దానం చేయండి
45. మఠాలు దేవాలయాకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తరువాతి తరం వాళ్ళకు శిక్ష పడుతుంది.
46. ఇతరులను అనవసరంగా విమర్శించడం, మిమ్మలిని మీరు పొగడుకోవడం మానండి
మీరు, మీ అధికారం ఏవీ శాశ్వతం కావు. ఇతరులను ఎదగనివ్వండి. మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి. మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవరచుకోండి 🌺🌼🌺
11

🌹🕉️అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని... 🌹

దేవాలయం లో ప్రవేశించగానే చేయవలసిన నియమ 🕉️అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని...*_🚩
🕉️అది తప్పు...ధర్మం దానంతట అదే గెలవదు,,
🕉️నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి..
అర్థం కాలేదా...?

🕉️ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాలలోకి
తొంగి చూడు..
🕉️కృత యుగం లో
తన భక్తుడైన ప్రహ్లాదున్ని కాపాడడానికి
ధర్మ సంస్థాపనకు భక్తుడి కోసం భగవంతుడు ఉన్నాడు.
🕉️అని చెప్పడం కోసం సత్యాన్ని స్థాపించడం కోసం
అణువు అణువు లో భగవంతుడు
నృసింహ రూపంలో వ్యాపించి అహోబిల క్షేత్రం లో
ఒక స్తంభం నుండీ వచ్చాడు .
హిరణ్య కశ్యపుడిని సంహరించాడు.
🕉️ధర్మాన్ని, సత్యాన్ని స్థాపించడం కోసం భగవంతుడు
ఎన్నో రూపాలు ధరించి, కష్టాలు పడుతూ ఉంటాడు.
🕉️'త్రేతాయుగంలో'
రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు,
సరేలే ధర్మమే గెలుస్తుంది కదా,
తన సీత తిరిగి వస్తుంది అని
రాముడు చేతులు కట్టుకొని
గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు.
🕉️రావణాసురుడి మీదా ధర్మయుద్ధం ప్రకటించాడు,,
ఆ రాముడికి అఖండ వానరసైన్యం తోడై
ధర్మం వైపుకు అడుగులు వేశారు,
🕉️ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి
తన భుజాలను, తొడ భాగాల చర్మాన్ని
బాణాలు చీల్చుకొని వెళ్ళాయి.
🕉️నరాలు తెగి రక్తం చిందుతున్న సరే తట్టుకొని నిలబడ్డాడు, పోరాడాడు.
యద్ధంలో⚔️ గెలిచాడు... ధర్మం గెలిచింది..!
🕉️'ద్వాపరయగంలో'
కురుక్షేత్రం యుద్ధంలో కృష్ణుడు
తను దేవుడు కదా అని ఒక ప్రేక్షకుడిలా యుద్దాన్ని చూడలేదు..
🕉️ధర్మం చూసుకున్నాడు పాండవుల పక్షాన నిలుచున్నాడు అర్జునుడికి రధ సారధిగా మారాడు,
గుర్రానికి గుగ్గిళ్లు పెట్టాడు,
అబద్ధం ఆడించాడు
చివరకు ధర్మాన్ని గెలిపించుకోవడం కోసం మాయకుడా చేసాడు...
🕉️అవన్ని ధర్మం కోసమే చేసాడు,
ధర్మాన్ని గెలిపించడం కోసమే చేసాడు.
అలా కురుక్షేత్ర యద్ధం ముగిసింది,
ధర్మం గెలిచింది...!
🕉️'కలియుగం'
ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు
సమస్యలతో పోరాడుతునే వున్నాం..
🕉️ప్రతి ఒక్కరి మదిలో మంచికి చెడుకి
యుద్ధం జరుగుతునే వుంది..
నువ్వు నమ్మితే అది నిజం మాత్రమే అవుతుంది..
🕉️అదే నువ్వు నా, ని, తన, మన భేదాలను పక్కన పెట్టి న్యాయం గురించి ఆలోచిస్తేనే ధర్మం అర్థం అవుతుంది..
🕉️అలా అలోచించి పోరాడిన రోజే ధర్మం గెలుస్తుంది,
తెగించి అలా ధర్మం వైపుకు నిలబడిన రోజు నీ వెనకాలా ప్రపంచమే నడుస్తుంది. . 🔱
🕉️ధర్మో రక్షతి రక్షిత.💪 🌺🌼🌺
10

🌹ఆడవాళ్లకు ఇవి అవసరం............!! 🌹

దేవాలయం లో ప్రవేశించగానే చేయవలసిన నియమ 1.స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకుని స్నానం చేస్తే దిష్టి పోతుంది.
2. బయటకు వెళ్లే ముందు ఛాతీ పైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు..
3.అరికాలు లో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్లిన చోట నెగటివ్ పవర్ వెంట రాదు..
4.తల స్నానం చేశాక వారానికి ఒక సారి అయినా తల వెంట్రుకలుకు సాంబ్రాణి వేసుకోవాలి ఆడవాళ్లపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది అది పోతుంది..
5.అష్టమి, అమావాస్య, ఆదివారం ఇలాంటి రోజుల్లో కచ్చితంగా దుర్గా స్త్రోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్లడం , బైరావుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది..
6. ఉదయం లేవగానే 21 సార్లు గం గణపతయే నమః అని తలుచుకుని పడక దిగాలి , నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కానీ లేదా 11 సార్లు ఓం నమఃశివాయ అని కానీ తలుచుకుని నిద్రపోతే మంచిది.
7.మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్లి అర్చన చేసుకోవాలి. ఉదా: వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు కచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి అర్చన చేసి రావాలి.
8.తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలా మంది అలా డ్రై గా ఉంచకుండా తల లో ఎదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి.
9.ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడ కూడదు కొత్తవారికి కష్టాలు చెప్పుకో కూడదు పరిచయం లేని వారిని సహాయం కొరకూడదు..
10. పండగ రోజుల్లో సెలవు దినాల్లో, కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి..మంగళవారం రోజుమోహనికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు..
11.కుటుంబ సభ్యులు దగ్గర ఏది దాపరికం ఉండకూడదు..
12. అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే, మొండి ధైర్యం మొదటికే మోసం. ఇవన్నీ పెద్దవాళ్ళు కాలం నుండి వస్తున్న పద్దతులు .
13. నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి , అమంగళం పలక కూడదు..పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచ కూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటుంది..
14. గొరోజనం వశీకరణకువాడుతారు మీకు తెలియని కొత్త వారి నుండి మాంత్రికులు తాంత్రికులు నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు.
15 చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ల కూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకుని తిరగకూడదు...
16. ఓం దుం దుర్గాయే నమః అని నిరంతరం జపించు కుంటూ ఉండండి మనసులో.. నిరంతర రామ నామ జపం క్రిష్ణ మంత్రం మీ ఇలవెలుపు ఇష్టదైవం ఎవరైతే వారి నామాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉంటే మంచి ఆలోచన మీకు రక్షణ కలుగుతుంది..
🙏🙏సర్వోజనా సుఖినోభావంత్ 🙏🙏 🌺🌼🌺
9

🌹ధూపం..లేదా సాంబ్రాణి పొగ...............!! 🌹

దేవాలయం లో ప్రవేశించగానే చేయవలసిన నియమ ధూపం..లేదా సాంబ్రాణి పొగ...............!!
సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా ఏడు రోజుల్లో
ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చునని వారు చెప్తున్నారు. ఆదివారం :
ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే... ఆత్మబలం, సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది.
సోమవారం:
దేహ, మానసిక ఆరోగ్య వృద్ధి. మానసిక ప్రశాంతత.. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
మంగళవారం:
శత్రుభయం, ఈర్ష్య, అసూయ, తొలగిపోతాయి. కంటి దృష్టిలోపాలుండవు. అప్పుల బాధ తొలగిపోతుంది. కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది.
బుధవారం :
నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం, పెద్దల, మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి వుంటుంది.
గురువారం:
గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి.
శుక్రవారం:
లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. శుభకార్యాలు చేకూరుతాయి. అన్నింటా విజయాలుంటాయి.
శనివారం :
సోమరితనం తొలగిపోతుంది. ఈతిబాధలుండవు. శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహం పొందవచ్చు. 🌺🌼🌺
8

🌹మరణం తర్వాత ఏం జరుగుతుంది..................!! 🌹

దేవాలయం లో ప్రవేశించగానే చేయవలసిన నియమ మరణం తర్వాత ఏం జరుగుతుంది..................!! భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది..... భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా, మొదట, మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే మీరు మరణానికి కొద్ది గంటలలో, చేరువలో ఉన్న వ్యక్తిని యొక్క అరికాలు పాదాలు గమనించారంటే.. అవి చల్లబడుతున్నాయని తె<లుసుకుంటారు.
సూక్ష వెండి తీగ.........
అసలు ఏం జరుగుతుందంటే, ఆత్మకి అనుసంధానింపబడి ఉన్న వెండితీగ తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండితీగ తెగుతుందో, శరీరంలో అంతవరకు ఉన్న ఆత్మకి స్వేచ్చ లభించి శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్లలేక, మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని, మరణించిన వెంటనే సూక్షమంగా పరిశీలిస్తే, ముఖంలోనో లేక శరీర ఇతర అవయవలాలలోనో సూక్షమైన కదలికలు గమనించగలగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే, ఆత్మ తన శరీరాన్ని కదలించడానికి ప్రయత్నించడం వల్లనే. మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది అయినా కూడా, వెండి తీగ తెగిపోవడం వలన, శరీరంలో దూరగలిగినా అక్కడ ఉండలేక పోవడం వలన, ఆత్మ ఇక శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. *ఏదో ఒక శక్తి వలన ఆత్మ, అలా శరీరం నుండి పైకి, ఇంకా పైకి ఆకర్షింపబడుతుంది.*
భౌతికశరీరానికి ముగింపు...........
శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మా తన ప్రియమైన వాళ్లతో మాట్లాడుతుంది, నేను మరణించలేదు అని చెబుతుంది. కానీ, ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినబడవు. నెమ్మదిగా ఆత్మకి అర్థమవడం మొదలవుతుంది తాను ఇక తన శరీరంలో జేరలేనని. శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి, ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడము మరియు చూడడము జరుగుతుంది. సాధారణంగా అంత్యక్రియలు జరిగేంతవరకూ ఆత్మ అలా సుమారు 12 అడుగులు శరీరానికి పైన వుంటుంది. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, *ఇకపై ఎక్కడైనా అంత్యక్రియలు కార్యక్రమం జరుగుతోంది అంటే, అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి, అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ, వింటూ ఒక సాక్షిభూతంగా వుందని.
భౌతికదేహంతో విడివడుట........
ఇక అంత్యక్రియలు కూడా జరిగాక, తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక, ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థీవ దేహం పంచభూతాలలో కలసిపోయిందని నిర్ణయించుకుంటుంది. అప్పటిదాకా తను దేహంలో ఉండడం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడివడిపోవడం వలన, ఇక ఆత్మకి పూర్తి స్వేచ్చ అనుభవంలోకి వస్తుంది. ఆత్మ తలచుకున్న మాత్రానా ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది. తర్వాతి 7 రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు, తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది. 7 రోజులు ముగిసాకా, తన కుటుంబానికి, ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని, భూమిని దాటి గగనంలోకి వెళ్ళిపోతుంది.
ఆత్మప్రయాణం.........
ఆత్మలలోకానికి వెళ్ళ్దడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసి వుంటుంది. అందువలన తర్వాతి 12 రోజులు అత్యంత ముఖ్యమైనవి. *ఈ 12 రోజులలో మనం జరుపవలసిన కార్యక్రమాలు చక్కగ నెరవేర్చవలసి వుంటుంది. మరియు మనం చేసిన తప్పులను క్షమించమని ఆత్మని అడగడము మరియు ప్రార్ధించడము జరుపవలెను. *అంత్యక్రియల తరువాత జరుపబడే కార్యక్రమాలు, ప్రార్థనలు, ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి.* ఆత్మలలోకానికి అడుగుపెడుతున్నాను అన్న సూచనగా, మార్గం యొక్క ముగింపులో ఆత్మకి ఒక అతి పెద్ద వెలుగు కనపడుతుంది.
పూర్వీకులను కలసుకొనుట.........
హిందువులు 11వ మరియు 12వ రోజున జరుపబడే ఇతర కార్యక్రమాలవలన, *ఆత్మ తన పూర్వీకులను, ఆప్త మిత్రులను, బంధువులను మరియు తనకు మార్గనిర్దేశనం చేసిన వారిని కలసుకోవడం జరుగుతుంది* మనం భౌతికంగా ఎలాగైతే, మన దూరపుబంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌగిలించుకుంటామో, అదేవిధంగా ఆత్మలలోకంలో కూడా 12వ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మని అహ్వానించి మనస్పూర్తిగా కౌగిలించుకుంటారు. ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గనిర్దేశకులు, ఆత్మని తను భూలోకంలో, భాద్యతవహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి, ఒక పెద్ద వెలుగువంటి బోర్డ్ ఉన్న ప్రదేశానికి తీసుకునివెళ్తారు. దీనినే *కార్మిక్ బోర్డ్* అంటారు. ఈ బోర్డ్ లో గత జన్మలో జరిగినదంతా చూపించబడుతుంది.
జీవితాన్ని పరిశీలించుకొనుట...........
ఇచ్చట అంక్షపెట్టే వారు, నిర్ణయించేవారు ఎవరూ ఉండరు. *ఎలాగైతే ఆత్మ భూమిపైన తన జన్మలో ఇతరులని నిర్ణయించిందో అంటే జడ్జ్ చేసిందో అలాగ ఇక్కడ తనని తానే జడ్జ్ చేసుకుంటుంది. భూమిపై ఎవరికైతే కష్టాలను కలిగించిందో అవన్నీ చూసుకొని తాను తప్పుచేసానని ఫీల్ అవుతుంది. *తాను చేసిన తప్పుల నుండి జ్ఞానం పొందటానికి శిక్ష కావాలని కోరుకుంటుంది.* ఈ విధమైన తన గత జీవితాన్ని పరిశీలించుకోవడం ద్వారా, *రాబోయే తన జీవితానికి ఒక బ్లూప్రింట్ అంటే నఖలు లేదా ఒక ప్లాను వేసుకుంటుంది. ఏలాంటి సంఘటనలని ఎదుర్కొనాలి, ఎలాంటి ఛాలంజ్ లను ఎదుర్కొనాలి, ఎలాంటి కష్టాలను అధిగమించాలి, ఇలాంటి ఎన్నో నిర్ణయాత్మక రచనలతో నఖలు తయారుచేసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే, నిమిషాలతో సహా, వయస్సు, వ్యక్తులు, పరిసరాలు, సంభవాలు లేక సంఘటనలు అన్నీ, తాను ఎదుర్కొనవలసినవి రచించుకుంటుంది.
నఖలు లేదా నమూనా.........
ఈ విధంగా మన తప్పిదాలకి మనమే బాధపడతాము మరియు శిక్షలు విధించుకుంటాము.* ఒక ముఖ్యవిషయం చెప్పాలి అదే ఏమిటంటే, మీరు ఒక తప్పు చేసే దానికి 10 రెట్లు లేదా 20 రెట్లు అధికంగా భాదపడవలసి వస్తుంది అంటారు. అది నిజం కాదు. కానీ ఆత్మా తన గత జన్మ పరిశీలన చేసుకున్నాక ఎంత ఎక్కువగా బాధపడుతుందో అంత ఎక్కువగా శిక్షని విధించుకుంటుంది. ఒకోసారి 5 నెలలు ఒక వ్యక్తి తాను బాధపెట్టి వుంటే 2 సంవత్సరాలు తన రాబోయే జన్మలో బాధపడాలి అని కూడా నిర్ణయంతీసుకుంటుంది. అందువలనే, *మీ భావోద్వేగాలని సరిచేసుకుంటూ ఉండాలి అని అంటూ వుంటారు ఎందుకంటే, అవే తర్వాత కూడా మోసుకునిపోబడతాయి కాబట్టి.* ఒకసారి ఈ నమూనా పూర్తిగా తయారుచేసుకున్నాక ఒక ప్రశాంతతో కూడిన కాలం ఆత్మకి అప్పుడు ప్రారంభమవుతుంది.
మరుజన్మ.........
మన మరుజన్మ ఆత్మలలోకంలో తయారు చేసుకున్న నఖలు పై ఆధారపడి ఉంటుంది.* జన్మకి మరుజన్మకి మధ్య 20 నుంచి 30 ఏళ్ళు పట్టవచ్చు లేదా ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. *మన తల్లిదండ్రులను మనమే నిర్ణయించుకుంటాము* ఒకోసారి తల్లిగర్భంలో పిండం రూపుదిద్దుకుంటున్న సమయంలోనో లేక గర్భం దాల్చిన 4, 5 నెలకో, లేక పుట్టడానికి కొంత సమయం ముందో ఆత్మ ప్రవేశించడం జరుగుతుంది. ఈ సృష్టి ఎంత అద్భుతమైనదంటే పుట్టే తేదీ, సమయము మరియు స్థలమునకు తగినట్ట్లు గ్రహముల అమర్చబడినాయి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను దురదృష్ట జాతకుడను, నాకు అదృష్టం లేదని కానీ అసలు విషయం ఏమిటంటే, *నీ జీవితం మొత్తం కూడా, నువ్వు ఆత్మలలోకంలో తయారుచేసుకున్న నఖలు లేదా బ్లూప్రింట్ మాత్రమే.* ఒకసారి మరుజన్మ తీసుకున్నాక, 40 రోజులదాకా బిడ్డ తన గత జన్మకి సంబందించిన జ్ఞాపకాలు అన్నీ కలిగివుంటుంది. అందువలనే ఒకోసారి సంబంధం లేకుండా నవ్వడమూ లేక ఏడ్వడమూ జరుగుతూ ఉంటుంది. 40 రోజుల తర్వాత, గత జన్మకి సంబందించిన అన్ని జ్ఞాపకాలు ఆటోమెటీక్ గా తుడిచివేయబడి, అసలు నాకు గతజన్మ అంటూ ఒకటి ఉందా అన్నంతగా మారిపోతాము.
నఖలు అమలుపరచబడుట.........
*ఇక అప్పటినుండి నఖలు లో లిఖించుకున్నది పూర్తిగా అమలులోకి రావడం ప్రారంభమవుతుంది.* ఇక అప్పటి నుండి, మన సంఘటనలు తలచుకుని, ఇతరులను మరియు భగవంతుని దూషించడము ప్రారంభమవుతుంది. *అందువలన మీరు ఇంకొకరిని వ్రేలెత్తి చూపే ముందర గుర్తుంచుకోండి, ఇతరులందరూ మీ నఖలు లో మీరు పూర్తిగా మీ స్వంత ఇష్టంతో లిఖించుకున్న ప్రకారమే మీకు సహాయం చేస్తున్నారని.* మనము ఏదైతే ముందరే జరగాలని నిర్ణయించుకున్నామో అదే జరుగుతోంది. *తలిదండ్రులు, బంధువులు, మిత్రులు, శత్రువులు, భాగస్వామీ అందరూ కూడా మన జీవితంలోకి ఎందుకువస్తున్నారంటే, వారు అలా రావాలని మీరే నిర్ణయించుకున్నారు కాబట్టి.* మరణించిన తర్వాత ఆత్మలు భూమిపైనే తిరుగుతూ ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిలో కొన్ని, చేయవలసిన పని మధ్యలో ఆగిపోవడం, అత్యంత దుఃఖం, గాయాల వలన మరణించడం, అనుకోని సమయంలో అంటే ఉన్నపలంగా మరణం సంభవించడము. ఏది ఏమైనప్పటికి ఆత్మకి 12 రోజుల గడువు మాత్రమే ఉంది, ఈ గడువులోపే తను చేయాలనుకున్నవన్నీ చేయగలగాలి. 12 రోజుల తర్వాత కొంతకాలం ఆగి, ఆత్మల లోకాల ద్వారం కూడా మూసివేయబడుతుంది. అలా జరిగితే, ఆత్మల పరిస్థితి మరీ దయానీయకమై పోతుంది. ఎందువలన అంటే, అవి ఆత్మలలోకానికీ వెళ్లలేవు, భూలోకంలో శరీరంతో వ్యవహరించడానికి మళ్ళీ జన్మ తీసుకోలేవు. *అందువలననే మన ప్రార్థనలు మరియు మరణించినవారికి జరుపబడే కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి.* అలా చేయడం వలన, ఆత్మలు తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించి ఆత్మలలోకానికి వెళ్ళి చేరుతాయి. హిందూ సాంప్రదాయంలో ఆ 12 రోజులు దేవాలయానికి వెళ్ళడం నిషిద్దం అని వుంది. *మనము మరణించిన వారికి కాపాడుటకు వారు తమ గమ్యాన్ని చేరుటకు మన వంతు సహాయం చేయడం కూడా ప్రాధాన్యమైనదే. *మనకి మరణం లేదు, మరణం అనేది శరీరమునకు మాత్రమే అంతం కాదు, అది ఒక విడిది సమయం మాత్రమే. 🌺🌼🌺
7

🌹దేవాలయం లో ప్రవేశించగానే చేయవలసిన నియమాలు 🙏🌹

దేవాలయం లో ప్రవేశించగానే చేయవలసిన నియమ 1. ఆలయాన్ని ప్రదక్షిణగా చుట్టి రావడానికి ముందే దైవానికి ప్రసన్నమైన మనస్సుతో నమస్కారం చేయాలి. నిధానంగా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించాలి.
2. ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడు దేవాలయం, ధ్వజ స్ధంభం నీడనకానీ, ప్రాకారం నీడను కానీ దాటకూడదు.
3. యజ్ఞోపవీతం ఉన్నవారు నడుముకు చుట్టుకొని కానీ, చెవికి తగిలించుకుని కానీ, అపసవ్యంగా వేసుకొని కానీ, లేదా దండ వలె ధరించి కానీ ఆలయప్రవేశం చేయకూడదు.
4. చంచలమైన మనస్సుతో స్వామిని దర్శించకూడదు. ఆలయంలో దేవుని ముందు నిలబడి అబద్దాలు చెప్పకూడదు. ఎందుకంటే భగవంతుడు సత్యస్వరూపుడు కాబట్టి ఆయన ఎదుట సత్యాన్ని దాచకూడదు.
5. దేవాలయంలో దేవునికి వీపు భాగం చూపిస్తు కూర్చోకూడదు. శివాలయంలో లింగం, నందికి మధ్యలో నడవకూడదు. శివాలయంలో లోపల లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు, బయట చేయాలి.
6. వస్త్రంతో కానీ, శాలువాతో కానీ శరీరాన్ని కప్పుకోవాలి.
7. దేవాలయంలో ప్రవేశించి భక్తితో రోదించకూడదు. రోదిస్తూ దేవుని స్తుతించకూడదు.
8. గంజి ( స్టార్చ్ ) వేసిన వస్త్రాలు ధరించి దేవుని దర్శించ కూడదు.
9. రిక్త హస్తాలతో దేవాలయం దర్శించ కూడదు.
10. దేవాలంలో స్వార్ధంతో కూడిన మాటలు, ప్రవర్తన ఉండ కూడదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని దైవంగా భావించాలి.
11. గుడి దగ్గర ఉండే యాచకులకు తోచిన సహాయం తప్పక చేయాలి. ఇంటి నుండి తయారు చేసుకుని తీసుకువెళ్ళిన ప్రసాదాన్ని తప్పక అక్కడ వితరణ చేయాలి.
12. సాంప్రదాయానికి విరుద్ధంగా వస్త్రాలు ధరించకూడదు.
13. మహిళలు తప్పక కుంకుమ బొట్టు ధరించాలి. టిక్లిలు పెట్టరాదు,తలలో ఏదేని పువ్వులను ధరించాలి.
14. మహిళలు జుట్టు విరబోసుకుని దేవాలయాలు దర్శించ కూడదు.
15. మలిన, చిరిగిన వస్త్రాలు ధరించి వెళ్ళకూడదు. ఉతికిన బట్టలనే వేసుకోవాలి.
16. గుడిలో మొదట ధ్వజ స్థంబం యొక్క శిఖరం దర్శించి మూడు ప్రదక్షిణలు చేయాలి. గుళ్ళో గోమాత ఉంటే తప్పక ఏదేని గ్రాసం ఇచ్చి ప్రదక్షిణలు చేయాలి.
17. గుడి చుట్టూ ఏర్పాటు చేసిన బలి పీఠాలను తాకకూడదు.
18. గుళ్ళో దేవునికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేయకూడదు.
అమ్మ అందరిని చల్లగా చూడమ్మా 🙏 🌺🌼🌺
6

🌹నీ భక్తి ఎంత?🌹

karmapalam *కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు.*
ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది.
*పూజారి బయటకు వచ్చి చూడగా.*
పెద్ద బంగారు పళ్లెం ఒకటి కనిపించింది
. *వెళ్లి చూడగా...*
*దానిపై*
‘నా భక్తుని కొరకు’
అని రాసి ఉంది.
*ఈ బంగారు పళ్లాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు.*
పళ్లాన్ని తీసుకుందామని ముట్టుకోగానే...
*అది మట్టిపాత్రగా మారిపోయింది.*
విడిచి పెట్టగానే మళ్లీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది.
ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది.
*ఆలయం కిక్కిరిసిపోయింది.*
ఒక్కో భక్తుడు రావడం...
పళ్లాన్ని ముట్టుకోవడం...
అది మట్టిపాత్రలా మారిపోవడం...
ఇదే తంతు!
*విషయం కాశీ రాజుకు తెలిసింది.*
రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్లాడు.
*జనులందరూ చూస్తుండగా బంగారు పళ్లాన్ని పట్టుకున్నాడు.*
అది మట్టిపాత్రగా మారిపోవడమే కాదు... నలుపు రంగులో కనిపించింది.
*తానెంత అధముడనో రాజుకు అర్థమైంది.*
అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు.
*ఇంతలో ఓ పెద్దాయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు.*
మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చలించిపోయాడు.
కళ్లు లేని వాళ్లను చూసి కంటతడి పెట్టుకున్నాడు.
*‘విశ్వనాథా !*
*ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు తండ్రి’*
*అని మొరపెట్టుకున్నాడు.*
మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సాయం చేశాడు.
ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన రెండు ఫలాలనూ ఇచ్చేశాడు.
*చివరగా ఆలయంలోకి వచ్చాడు.*
స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు.
ఇంతలో పళ్లెం సంగతి తెలిసింది.
*ఈ వింతేమిటో తెలుసుకుందామని అటువైపు వెళ్లాడు.*
దూరంగా నిల్చుని చూస్తున్నాడు.
తిరిగి వెళ్లిపోబోతోంటే.. ఆలయ పూజారి..
*‘ఓ పెద్దాయన... నువ్వూ వచ్చి ముట్టుకో... రోజూ* *గుడికొస్తావ్‌గా, నీ భక్తి*
*ఏ పాటిదో తెలిసిపోతుంది’*
అని హేళనగా అన్నాడు.
పెద్దాయన వెళ్లి పళ్లెం పట్టుకున్నాడు.
అది మరింత బంగారు వన్నెల్లో మెరిసిపోతూ కనిపించింది.
*అందరూ ఆశ్చర్యపోయారు.*
అర్చనలు, అభిషేకాల భక్తికి నిదర్శనాలు కాదు.
*ఆపన్నులను ఆదుకునే తత్త్వం ఉండటమే నిజమైన భక్తి.*
అలాంటివారే నిజమైన ఆధ్యాత్మికవాదులు.
*నా జీవితం లోనివి*
*కష్టాలు కాదు,*
*భగవంతుని వరాలు!*
నేను శక్తిని అడిగాను --
*భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.*
నేను సంపదను అడిగాను--
*భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.*
నేను ధైర్యాన్ని అడిగాను --
*భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.*
నేను వరాలు అడిగాను --
*భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.*
నేను ఆయన ప్రేమను అడిగాను-
*భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు.*
నేను జ్ఞానాన్ని అడిగాను -
*భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.*
నేను పురోగతి అడిగాను -
*భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.*
నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను -
*భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు.*
నేను ఆయన్ను మరువకూడదు
అని అడిగాను --
*భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు
.* నేను పాపాలు క్షమించమని అడిగాను --
*భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.*
అలా జీవితంలో నేను కోరుకున్నదేదీ పొందలేదు -
*నాకు కావలసిందే నేను పొందాను.*
ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటననుండి నాకు *అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను.*
*చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్ధం చేసుకున్నాను*.
*జరిగేది అంతా మన మంచికే.* 🙏
🌺🌼🌺
5

🌹కర్మఫల హేతుర్భూః!🌹

karmapalam మనం చేసే పాపకర్మలే గ్రహరూపంలో వచ్చి మనల్ని బాధిస్తాయి. ఎందుకంటే? కర్మ బలీయమైనది. పరీక్షిత్తు మహారాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు. అదే రాజ్యంలో కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు వుండేవాడు. అతడు గొప్ప మంత్రవేత్త. రాజుగారు పాము కాటు వల్ల మరణించబోతున్నాడని తెలిసి ఆయనను తన మంత్ర బలంతో రక్షించాలని రాజప్రాసాదానికి బయలుదేరాడు. అనుకోకుండా దారిలో తక్షకుడు కశ్యపుడు ఇద్దరూ ఒకరికొకరు ఎదురు పడ్డారు. తక్షకుడు కూడా బ్రహ్మణ వేషధారియై వున్నాడు. తనకు ఎదురు పడిన కశ్యపుడిని చూసి “మహాత్మా! తమరెవరు? ఎక్కడి వరకు తమ పయనం?” అని అడిగాడు. దానికి కశ్యపుడు “ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబర పడుతున్నాను” అంటూ దాపరికం లేకుండా ఉన్న విషయం చెప్పేశాడు. అది వింటూనే పకపకా నవ్వుతూ “ఓయీ అమాయకపు బ్రాహ్మణుడా! పరీక్షిత్ మహా రాజుని కాటువేయబోయేది ఏదో నీటిపామో, బురద పామో అనుకుంటున్నావా? సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడయిన తక్షకుడే స్వయంగా అయితే!” అన్నాడు. “తక్షకుడే కానీ అతడ్ని మించిన ఆదిశేషుడైనా రానీ నా దగ్గర ఉన్నది గారడీవాడి పాముమంత్రమో, విషకీటక మంత్రమో అనుకుంటున్నావా?” అని ప్రశ్నించాడు కశ్యపుడు. “అంత గొప్పవాడివా! అయితే చూడు నేనే ఆ తక్షకుడ్ని” అని నిజరూపం చూపించాడు తక్షకుడు. ఆశ్చర్యపోయిన కశ్యపుడు “సర్పరాజా! నీకిదే నా ప్రణామాలు. నాదొక చిన్న విన్నపం. నా మంత్రాధిష్ఠాన దేవత అనుగ్రహం వల్ల నువ్వు రాజును కాటువేసినా సరే దాన్ని తక్షణం విరిచెయ్యగల మంత్రాన్ని అనుష్ఠించిన వాడను. అది ప్రయోగించి, ప్రభువును రక్షించి బహుమానం పొందగలను అని నా దృఢవిశ్వాసం” అన్నాడు. అది విన్న తక్షకుడు “నీ ఆత్మవిశ్వాసం కడు శ్లాఘనీయమే! ఈ మర్రి చెట్టునుచూడు! దీని ఊడలు ఏవో, మొదలు ఏదో తెలియరానంత దట్టంగా ఉంది కదా! లెక్కపెట్టడానికి సాధ్యం కానన్ని పక్షులకిది ఆలవాలమై కూడా ఉంది. దీన్ని ఉన్నపళంగా కాలి బూడిద చెయ్యగల నా విష శక్తిని చూడు” అంటూ ఆ చెట్టును కసితీరా కాటువేశాడు తక్షకుడు. మరు క్షణం ఆ మహా వృక్షం తక్షకుడి విషకీలలకు, నిలువునా మాడి బూడిదైపోయింది. కశ్యపుడు అదంతా చూసి చిరునవ్వు నవ్వుతూ…. “నీవు చెప్పిన దాంట్లో ఇసుమంతయినా అసత్యం లేదు తక్షకా నీ పని అయింది కదా ! ఇక ఇప్పుడు చూడు!” అని పిడికెడు బూడిదను ఆ భస్మరాశి నుంచి తీసుకుని, అత్యంత శ్రద్ధా భక్తులతో అధిష్ఠాన మంత్రజపం చేసి అభిమంత్రించి ఆ బూడిదను కుప్పపై పోసి జలం సంప్రోక్షించి విడిచిపెట్టాడు. అతి విచిత్రంగా మొత్తం సకల పక్షిగణ సహితంగా ఆ మహావృక్షం ఇంతకు మునుపు ఉన్నట్లుగానే అక్కడ నిలబడింది. అతడు సామాన్యుడు కాడని సర్పరాజుకి అర్థమైంది. వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని “మహా మంత్రద్రష్టా! తమను తక్కువగా అంచనా వేసాను. నా అజ్ఞానాన్ని మన్నించండి! తమకు తెలుసో... లేదో, నిజానికి విధి వశాత్తూ పరీక్షిత్తు శాపం వలన మృత్యువడికి వెళ్లవలసి ఉంది. లేకుంటే, అంతటి ధర్మమూర్తికి సహజ మరణం సమీపించడం ఇప్పట్లో దుర్లభం. త్వరలో కలిప్రవేశం జరగబోతోంది. అప్పటికి జనమేజయుడు రాజుగా ఉండాలంటే, తక్షణం పరీక్షీతుడి అంకం పరిసమాప్తం కావాలి. ఇది విధాత కృతమే గాని, పరీక్షిత్తుకు సహజంగా జనించిన వికృతం కానేకాదు. ఇంతకూ తమకు కావలసింది....” అంటూ తక్షకుడు మాట పూర్తి చేసేలోగా “ధనమయ్యా! ధనం!” అన్నాడు బ్రాహ్మణుడు. “అంతేకదా! ఈ విలువైన నాగమణులు తీసుకోండి! ఇంకా వజ్ర వైఢూర్యాలు మీపరం చేస్తాను” అని అప్పటికప్పుడే పాతాళ నిధుల్లోని విలువైనవి కశ్యపునికి బహుకరించి పంపేసాడు. ఇక్కడ మనం గమనించ వలసింది కాలం. కాలానికి, మాయకు ఎవ్వరూ అతీతులు కారు. తక్షకుడు విషనాగు అంటే ప్రారబ్దకర్మ. దానిని కూడా జయించింది మంత్రశాస్త్రం. కాటు చేత మహావృక్షం కాలి బూడిద అయితే, మంత్రం మరలా దానిని బ్రతికించింది. అంటే మంత్రం చేత ప్రారబ్దకర్మ తొలగించబడుతుంది. కానీ ఆ మంత్రం పనిచేయాలంటే మంత్రం జపించేవాడి ప్రారబ్ధకర్మ బాగుండాలి. అంటే మనం సత్కర్మలు మాత్రమే ఆచరించాలి. 🌺🌼🌺
4

🌺 ఉసిరి యొక్క 21 నామములు 🌺

🌺 ఉసిరి.. హిందు ధర్మంలో దీనికి ప్రత్యేకస్థానం ఉంది. అందులో కార్తీకంలో దీనికి ఇచ్చే స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కార్తీకంలో ప్రతీది ఉసిరితోనే ముడిపడి ఉంటుంది. దీనివెనుక సైన్స్ దాగి ఉంది. స్నానం, దానం, దీపం, భోజనం ఇలా అన్నింటిలో ఉసిరిని మన పెద్దలు చేర్చారు.🌺
🌺 ఉసిరి దీపం వెలిగించాలి...ఇలా చేయడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోయి లక్ష్మి దేవి అనుగ్రహం,అదృష్టం లభిస్తుంది.🌺
కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టాలని పెద్దలు చెప్తారు. అయితే ఆ సమంయలో ఉసిరికి సంబంధించిన పవిత్రమైన 21 నామాలను చదివితే విశేష ఫలితాలు వస్తాయి, ఆ నామాలు.🌺
🌺ఓం ధాత్రై నమ:
ఓం రామాయై నమ:
ఓం శాంత్యి నమ :
ఓం లోక మాత్రయై నమ:
ఓం కాంత్యి నమ :
ఓం ఆబ్ధి తనయాయై నమ:
ఓం మేధాయై నమ:
ఓం గాయత్రీయై నమ:
ఓం కళ్యానై నమ:
ఓం సావిత్రియై నమ:
ఓం విష్ణు పట్నై నమ:
ఓం విశ్వరూపాయై నమ:
ఓం మహాలక్ష్మిఁ నమ:
ఓం సురూపాయై నమ:
ఓం ప్రకృతె నమ:
ఓం కమనీయాయై నమ:
ఓం ఇందిరాయై నమ:
ఓం అవ్యక్తాయై నమ:
ఓం సుధ్యత్యి నమ:
ఓం కమలాయై నమ:
ఓం జగధ్దాత్రియై నమ:🌺

🌺ఇలా పైన పేర్కొన్న నామాలను చదివి ఉసిరి దగ్గర దీపం పెట్టాలి. ఉసిరి చెట్టుకొమ్మలను తెచ్చి దీపం పెట్టడం శాస్త్రసమ్మతం కాదు.
కానీ ఆపధర్మంగా బజారులో అమ్ముతున్న వాటిని తెచ్చి ప్రస్తుత కాలంలో భక్తులు దీపం పెడుతున్నారు.🌺
🌺కనీసం వచ్చే ఏడాదికన్నా మీ మీ ఇండ్లలలో ఉసిరి చెట్టు పెంచి అక్కడ దీపాలను పెట్టండి. కనీసం గల్లీకి ఒక చెట్టు పెంచినా ముక్తి, భుక్తి దొరుకుతాయి. ఇది సైన్స్ పరంగా అత్యంత ఔషధ గుణాలను కలిగిన మొక్క.
3

🪔 ఐశ్వర్య దీపం అంటే ఏంటి ? ఎలా పెట్టాలి?.🪔
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

💥ఐశ్వర్యా దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం.. ఇది ఎందుకు పెడతారు ఎలా పెడతారో తెలుసుకుందాము..
సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుంటుంది, అప్పులు తీరకుండా వడ్డీ పెరిగి పోతూ ఉంటుంది, వ్యాపారం లో లాభాలు లేకుండా ఇబంధులు ఉన్నవారికి, అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి, బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దిష్టివళ్ళ సరిగ్గా జరగకుండా ఉన్నవారికి, కోత్తగా ఎదైనా వ్యాపారం మొదలు పెట్టిన వారికి అభివృద్ధి కి, అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం " ఉప్పు దీపం " మంచి పరిహారం...

✳️ ఎలా పెట్టాలి ?✳️
💥 ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకొని పసుపుకుంకుమా రాసి నెలపైన బియ్యం పిండి పసుపు కుంకుమ తో ముగ్గు వేసి దానిపైన ప్రమిధలు ఒకదాని పైన ఒకటి ఒక్కటిగా పెట్టి అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు పైనపసుపు కుంకుమ చల్లాలి ఒక చిన్న ప్రమిధలు ఒకదాని పైన ఒకటి పెట్టి పసుపుకుంకుమా పూలు పెట్టి ప్రమిధలో నూనె కానీ నైయి కానీ పోసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి..దీపం శ్లోకం చదువుకోవాలి...
పళ్ళు కానీ, పాలు పటికబెల్లం, కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి , లక్ష్మీ, వేంకటేశ్వరస్వామి స్త్రోత్రం చదువుకోవాలి.

✴️కనకధార స్త్రోత్రం కూడా చదివితే మంచిది.✴️
శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిధలు లో ని ఉప్పు మటుకు తీసి నీటిలో కలిపి ఇంటి బయట తొక్కని జాగాలో పోయాలి అవకారం ఉన్నవాళ్లు నదిలో కలపవచ్చు, ప్రమిధలు మార్చాల్సిన పని లేదు ప్రతి వారం అవి వాడుకోవచ్చు , ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి...అలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారం కానీ 21 కానీ 41 శుక్రవారాలు కానీ అనుకోని ఇంట్లో చేయాలి ఈ ఉప్పు దీపం ఈశాన్యం మూల పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది..41 శుక్రవారం ఈ ఉప్పు దీపం పెట్టే వారికి శాశ్వతంగా ధనము యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి..
కొందరు ఇది రాక్ సాల్ట్ పైన పెడతారు కానీ రాళ్ళ ఉప్పు పైన పెట్టడమే సంప్రదాయం...(ఈ తీసేసిన ఉప్పుని ఇంటి బయట ఉన్న షిన్క్ లో కూడా నీటిలో కలిపి పోయవచ్చు సౌకర్యం లేని వారికి).. ఇది ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు....
2

*🌸విచిత్ర వినాయక దేవాలయము🌸*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

*🌷తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం🌷*
ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా...పిట్ట కొంచం కూత ఘనం అన్నట్టు, ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం.
ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు.
దక్షిణాయన కాలం(జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం.
అతిశయ వినాయగర్ ఆలయంలో మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.., నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి..,
వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి.
అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే.
కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు.

*🌸చారిత్రక ప్రాశస్త్యం*
ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది.
జై గణేశా..!!🙏🏻👏🕉🌼🌷
1