• iconStories in Telugu
  • icon


🌹ఒక మంచి కథ 🌹 - #39


ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహం లో భాగవత ప్రవచనం ఇస్తున్నారు..
అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, ఒక మూల దాక్కున్నాడు.
భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది.
తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు.
దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు.
భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము అని అనుకున్నాడు.
దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు.
బ్రాహ్మణుడు భయపడి 'నా దగ్గర ఏమీ లేదు ' అని అన్నారు.
దొంగ, మీ దెగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ పడటంలేదు.
మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి' అని అన్నాడు.
బ్రాహ్మణుడు ఆలోచించి, "బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజూ ఇద్దరు పిల్లలు వస్తారు.
ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు.
ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు.
ఆ నల్ల మబ్బు ఛాయలో, పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు"
అని ఆ దొంగ నుండి తప్పించుకోటానికి చెప్పాడు.
దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు.
యమునా నది తీరం వద్ద కూర్చుని, ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు.
ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది , ఇద్దరు పిల్లలు వస్తున్నారు.
ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ.
బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ,
'ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు ' అని అనుకున్నాడు.
ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది.. తరువాత చూస్తే, దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది.
అది తీసుకుని,ఆ దొంగ బ్రాహ్మణుడి దెగ్గరకి వెళ్లి, జరింగింది అంతా చెప్పాడు.
ఆనందబాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటు, తనకు చూపించమని దొంగని అడిగాడు.
ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి, కనిపించలేదు.
అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణడిని ,నీవు ఒక దొంగని అనుగ్రహించావు , నాకు కూడా దర్శనం ఇవ్వవా?" అని బాధపడ్డాడు.
అప్ప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు
' నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు , కాని , దొంగ, నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు.
అపార నమ్మకం, సమర్పణ, "శరణాగతి" ఉన్న చోటే నేను ఉంటాను." (అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ)
మనం చేసే ధ్యానం అయినా అంతే మనస్ఫూర్తిగా సాధన చేస్తే కచ్చితంగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఫలితాన్ని పొందగలం!

సర్వేజనా సుఖినోభవంతు!

శ్రమయేవ జయతే - #38

శ్రమయేవ జయతే ఆ ఊళ్ళో ఒక పెద్దమనిషికి నలుగురు కొడుకులు . ఆ నలుగురూ పరమ బద్ధకస్తులు , ఇటు పుల్ల తీసి అటు పెట్టరు . ఆ వృద్ధుడు కొన్నాళ్ళకు అనారోగ్యం పాలయ్యాడు . సోమరిపోతులైన కొడుకులు ఏమైపోతారో అని ఆందోళన చెంది నలుగురినీ పిలిచి , తన దగ్గర చాలా బంగారం , నిధినిక్షేపాలు ఉన్నాయని , కానీ అవి ఎక్కడ పెట్టాడో మరిచిపోయానని , అయితే వాటిని పొలంలోనే ఎక్కడో ఒక చోట దాచిపెట్టానని చెప్పాడు . కొడుకులు నిరాశ చెందారు . కొన్నాళ్ళకే వృద్ధుడు మరణించాడు . ఆ తర్వాత ఆ నలుగురూ పొలాన్ని తవ్వి నిధి నిక్షేపాలు వెతకాలని నిశ్చయించుకొని , చాలా కష్టపడి పొలాన్ని బాగా గుల్లగా తవ్వారు . ఒక మూల లోతుగా తవ్వితే నీళ్ళు కూడా పడ్డాయి . అటు వైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి బాగా తవ్విన నేలను , నీటివసతిని చూసి సరిగ్గా సాగుచేస్తే మంచి పంట పండుతుందని చెప్పాడు . నలుగురూ ఆ పొలంలో కూరగాయలు , పూల మొక్కల వంటివి పెంచడం మొదలు పెట్టారు . కొన్ని వారాలకు మంచి దిగుబడి వచ్చింది . దాన్ని అమ్మగా లాభాలు కూడా బాగానే వచ్చాయి . ఆ అన్నదమ్ములకు శ్రమించడమే అసలు నిధి అని అర్థమైంది . ఆనాటి నుండి సుఖంగా , సంతోషంగా జీవించడం నేర్చుకున్నారు . ఆర్థికంగా నిలదొక్కుకున్నారు . కృషితో నాస్తి దుర్భిక్షం .


పిడికెడు ఉప్పు (ఒక నీతి కథ) - #37

పిడికెడు ఉప్పు (ఒక నీతి కథ) ఒక యువకుడి తన గురువు దగ్గరికెళ్ళి ఇలా చెప్పాడు..!! "స్వామీజీ...నా జీవితమంతా కష్టాలే..!! ఈ జీవితాన్ని భరించలేకపోతున్నాను..!! దయచేసి నా కష్టాలు తీరే మార్గo చెప్పండి." అప్పుడు గురువు ఆ యువకుడి వైపు చూశాడు..!! ఒక గ్లాసు నీటిలో ఒక పిడికెడు ఉప్పు వేయమన్నాడు..!! యువకుడు అలాగే చేశాడు...!! ఇప్పుడు ఆ నీటిని "తాగు" అన్నాడు గురువు..!! . యువకుడు గ్లాసు పైకెత్తాడు..ఆ నీటిని తాగాడు...!! వెంటనే ఉమ్మేశాడు...!! "అబ్బ... భరిoచలేని ఉప్పు...." ఇంకో పిడికెడు ఉప్పు తీసుకుని... ఆ యువకుడిని చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు గురువు..!! "ఈ ఉప్పు ఈ చెరువులో వేసి ఈ నీళ్ళని తాగు అని చెప్పాడు గురువు..!! ఆ యువకుడు చెరువు నీటిని గడగడా తాగేశాడు..!! "ఎలా ఉన్నాయి ఈ నీళ్ళు..??" అడిగాడు గురువు..!! "నీరు తీయగా ఉంది" చెప్పాడు ఆ యువకుడు..!! "అదే పిడికెడు ఉప్పు, అప్పుడెందుకు భరించలేకపోయావు..?? ఇప్పుడెలా భరించావు..?? అడిగాడు గురువు..!! అప్పడు ఆ యువకుడు ఇలా చెప్పాడు..!! అది తక్కువ నీరు... గ్లాసుడు నీరు... అందుకే ఉప్పగా ఉంది. ఇది చెరువు..!! అంటే ఎక్కువ నీరు..!! అందుకే ఉప్పదనం లేదు...!! " అన్నాడు యువకుడు..!! అప్పుడు ఆ గురువు ఇలా చెప్పాడు..!! "నాయనా...!! సమస్యలు పిడికెడు ఉప్పు లాంటివి...!! అది గ్లాసులోనూ పిడికెడే...!! చెరువులోనూ పిడికెడే...!! కానీ నీ జీవితం గ్లాసులా ఉండాలా...!! చెరువులా ఉండాలా అన్నది మాత్రం నువ్వే నిర్ణయించుకోవాలి...!! నీ ఆలోచనా శక్తి, సహన శక్తి పరిధి పెరిగితే పిడికెడు ఉప్పు తక్కువవుతుంది...!! ఆ పరిధి సంకుచితమైతే పిడికెడు ఉప్పు భరించలేనంత అవుతుంది" అన్నారు గురువు. పరిస్థితి అవగాహన చేసుకొని జీవితాన్ని నందనవనం చేసుకున్నాడా యువకుడు.


ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పిపోయాడు. - #36

ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పిపోయాడు. అతడు తెచ్చుకున్న నీళ్లు రెండు రోజుల తర్వాత అయిపోయాయి. నడుస్తున్నాడు. నీరు ఎక్కడా కనబడటం లేదు. తన జీవితపు ఆఖరు దశకు చేరానని అతడికి తెలిసిపోయింది. ఈ రాత్రి గడవదు. రేపు ఉదయం చూడను అని అనుకుంటున్న దశలో ప్రయత్నం చెయ్యడమా? అలాగే నిరాశతో కూలబడి పోవడమా ఎటూ నిశ్చయించుకోలేకపోతున్నాడు. దూరంగా ఒక గుడిసెలాంటిది కనబడింది. అది నిజమా? తన భ్రమా? ఏమో! నిజమేమో! అక్కడ తనకు నీరు దొరకవచ్చునేమో! చనిపోయేముందు ఆఖరు ప్రయత్నం చెయ్యాలనుకున్నాడు. శక్తిని కూడదీసుకున్నాడు. తడబడిపోతున్న అడుగులతో ముందుకు నడుస్తున్నాడు. గుడిసెలోకి వెళ్లాడు. అక్కడ ఒక నీటి పంపు (బోరింగ్) కనబడింది. దానిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. దాని దగ్గరకి వెళ్లి కొట్టాడు. నీరు రావడం లేదు. శక్తినంతా ఉపయోగించి కొట్టాడు. అయినా ప్రయోజనం లేదు. నిరాశ నిస్పృహ ఆవరించాయి. ఒంట్లో ఉన్న కొద్ది నీరూ అయిపోయింది. కళ్లు మూసుకుపోతున్నాయి. ఒక మూలన సీసా కనిపించింది. దానిలో నీరు ఉంది. మూత గట్టిగా బిగించి ఉంది. మూత విప్పి దాన్ని ఎత్తిపట్టి తాగుదామని పైకి ఎత్తాడు. దానికి ఒక కాగితం కట్టి ఉంది. దాని మీద ఇలా ఉంది. ఈ బాటిల్లో నీరు బోరింగ్ పంపులో పోయండి. పంపు కొట్టండి.. నీరు వస్తుంది. మీరు మళ్లీ ఈ బాటిల్ నింపి పెట్టండి. అతడికి సందేహం కలిగింది. ఈ నీరు తాగెయ్యడమా? బోరింగ్ పంపులో పొయ్యడమా? ఎంత కొట్టినా రాని నీరు.. ఈ బాటిల్లో నీరు పోస్తే వస్తుందా? ఉన్న ఈ నీరు కాస్తా పోసేస్తే తర్వాత రాకపోతే తన గతి ఏమి కాను? చేతిలో ఉన్న నీరు తాగితే కనీసం ఇంకో రెండు రోజులు బతకొచ్చు. అందులో పోసేస్తే మరణం ఖాయం. ఏమి చేయాలి? ఎంతకూ ఆలోచనలు తెగడం లేదు. ఒక నిశ్చయానికి వచ్చాడు. నీళ్లను పంపులో పోశాడు. బోరింగ్ పంపు కొట్టడం మొదలుపెట్టాడు. *ఆశ్చర్యం!!!!!* పాతాళ గంగ పైకి తన్నుకు వచ్చింది. నీళ్లు తాగి బాటిల్ నింపాడు. మూలన పెట్టాడు. తను తెచ్చుకున్న బాటిల్ నింపుకున్నాడు. గుడిసెలో ఎడారి మ్యాప్ కనబడింది. తను ఎటు వెళ్లాలో చూసి బయలుదేరాడు.
.............................................
ఏదైనా పొందాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి.
..........................................
ఇవ్వడం వల్ల మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి. కృషి చెయ్యకుండా ఫలితంఆశించకూడదు_ _చావు బతుకుల మధ్య_ *ఇక్కడ తర్కం* ఎంత కొట్టినా పంపు నుండి రాని నీళ్ళు కొద్ది పోస్తే ఎలా వస్తాయి ? రిస్క్ తీసుకోకుండా బాటిల్లో నీళ్ళు తాగేస్తే.... మహా అంటే మరి కొన్ని గంటలు ప్రాణం నిలుపుకోవచ్చు. తరువాతా...?? అసలు బాటిల్లో నీళ్ళు ఎలా వచ్చాయి. తన కన్నా ముందు ఎవరికో ఇలాంటి సమస్యే ఎదురై వుండొచ్చు. వాళ్ళు పంపులో పోసి ఆ తరువాత తిరిగి బాటిల్ లో నింపి వుండొచ్చు. కాబట్టి రిస్క్ అనుకున్నా గానీ బాటిల్ లో నీళ్ళు పంపులో పోయడమే కరెక్ట్. గత్యంతరం లేని క్లిష్ట పరిస్థితుల్లో *నమ్మకం* ముఖ్యం!!! *నమ్మడమే* శ్రేయస్కరం.
.............................................
నువ్వు ఇవ్వకుండా*_ _*దేనినీ పొందలేవు*_ ..ఇచ్చి...... పుచ్చుకోవడం నేర్వండి. *అడిగేటప్పుడు ఎలా అడుగుతావు....... ?* *ఇవ్వడం కూడా అలాగే నవ్వుతూ ఇవ్వండి.*


కొన్ని నిముషాలు ప్రతిరోజూ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యండి - #35

ఒక రైతు ధాన్యం కొట్టులో తన చేతి గడియారాన్ని పోగొట్టుకున్నాడు . అదంటే రైతుకు ప్రాణం . దాని కోసం గోడౌన్ మొత్తం వెదికాడు , దొరకలేదు . ఆశ ఒదులుకొనే సమయంలో అక్కడ దగ్గరలో ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు . వాళ్ళను పిలిచి గడియారం వెదికి ఇస్తే మంచి బహుమతి ఇస్తానని చెప్పాడు . పిల్లలు ధాన్యం కొట్టు మొత్తం వెదికారు . కానీ వాళ్ళకు కూడా దొరకలేదు . నిరాశగా కూర్చుని ఉన్న రైతు దగ్గరికి ఒక పిల్లవాడు వచ్చి గడియారాన్ని వెతికి పెడతానన్నాడు . నిజాయితీగా కనిపిస్తున్న పిల్లవాడిని చూసి సరే అన్నాడు . వాడు లోపలికి పోయి గడియారాన్ని వెదికి తీసుకొచ్చాడు . రైతు ఆశ్చర్యంగా చూసి " ఇంత మంది వెదికినా దొరకనిది నీకెట్లా దొరికింది " అని అడిగాడు . " నేనేం చేయలేదు , నిశ్శబ్దంగా ఉన్న ఈ కొట్టులో ప్రశాంతంగా పడుకొని చెవులు రిక్కించి విన్నాను . చిన్నగా టిక్ టిక్ మని వినబడ్డ వైపుకు పోతే అక్కడ కనబడింది . అంతే " అన్నాడు .( ప్రశాంతంగా ఉన్న మనసు అలసిన మనసు కన్నా చురుగ్గా పనిచేస్తుంది . కొన్ని నిముషాలు ప్రతిరోజూ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యండి . ఆ ప్రశాంతత మీరు కోరుకున్న విధంగా మిమ్మల్ని మీరు మలచుకోవడానికి ఉపయోగ పడుతుంది . )


తెలివైన వాళ్ళు కష్టాలకు బెదిరి పోరు - #34

ఓ పిల్లవాడు బుట్టెడు గుడ్లతో సైకిల్ మీద పోతూ దారిలో ఒక బండరాయిని గుద్దుకొని పడిపోయాడు . బుట్టెడు గుడ్లు పగిలి పోయాయి . ఆ అబ్బాయి చుట్టూ జనం మూగి , " ఇంకొంచెం జాగ్రత్తగా పోవాలి కదా " " చూసుకోకుండా ఎక్కడో ఆలోచిస్తూ తొక్కితే ఏమౌతుంది " వంటి ఉచిత సలహాలు , విమర్శలు చేస్తున్నారు . ఒక వృద్ధుడు అది చూసి " అయ్యయ్యో పాపం , గుడ్లన్నీ పగిలి పోయాయే ! ఆ గుడ్ల యజమానికి ఏం జవాబు చెప్తాడు . పోనీలే ! నేను కొంత సహాయం చేస్తాను , " అంటూ ఓ 20 రూపాయలు ఇచ్చి " ఇక్కడ ఈ చోద్యం చూస్తున్న చాలా మంది మంచివాళ్ళు , హృదయం ఉన్నవాళ్ళు , వాళ్ళు కూడా తోచింది ఇస్తారులే , తీసుకో అబ్బాయి . " అన్నాడు . వృద్ధుడి మాటలకు జనం జాలిపడి , తోచింది ఎంతో కొంత ఇచ్చి పోయారు . " ఆ పెద్దమనిషి లేకపోతే నీకు చాలా సమస్యలు వచ్చేవి కదా " సానుభూతి చూపించాడు ఒకతను . " సార్ .... ఆయనే మా యజమాని , నేను వాళ్ళ షాప్ లోనే పని చేస్తున్నాను , ఈ గుడ్లు వాళ్ళవే . " ( జీవితంలో ఒక్కోసారి అనుకోని సమస్యలు ఎదురవుతాయి . అయితే తెలివైన వాళ్ళు కష్టాలకు బెదిరి పోరు , కొత్త ఆలోచనలతో గట్టెక్కుతారు . )


అద్భుతమైన నీతి కథ - #33

ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు . కుక్కకి సౌకర్యంగా లేదేమో మొరుగుతూ తెగ అల్లరి చేస్తోంది . విసుక్కున్నారు రాయల వారు కుక్కని అదుపులో పెట్టడం ఎవరివల్లా కాలేదు . తెనాలి రామకృష్ణుడు వచ్చి " మహారాజా తమరు అనుమతిస్తే కుక్కని నేను అదుపు చేస్తాను " అన్నాడు . సరేనన్నారు రాయలవారు . వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కని తీసుకు పోయి నదిలో పారేశారు . కుక్క ప్రాణభయంతో ఈత కొడుతోంది . కాసేపయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణ అంతే కుక్క ఒక మూలకి పోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకుని పడుకుంది . ఆశ్చర్యపోయిన రాయల వారు " ఏం మాయ చేశావు రామకృష్ణా " అని అడిగారు . రామకృష్ణ నవ్వేసి " మహారాజా లోకంలో అందరూ తనున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశ పడతారు నీటిలో పడేశాక అంతకు ముందు తనెంత సురక్షిత ప్రదేశంలో వున్నదో అర్ధమయి కుక్కకి జ్ఞానోదయం అయింది . " అన్నాడు " అలాగే మన పిల్లలకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి విలువ అర్ధం కావడం లేదు కావున కష్టం యొక్క విలువను సమాజంలో ఏ మాత్రం సౌకర్యాలు లేకుండా జీవించే వారిని గురించి తెలియజేయాలి .


సృజనాత్మకత - #32

టాటా స్టీల్స్ చైర్మన్ వారాంతంలో నిర్వహించే ఉద్యోగుల సమావేశంలో ఉద్యోగుల సమస్యలు చర్చించేవారు . ఒకసారి ఒక కింది తరగతి ఉద్యోగి ఒక సీరియస్ సమస్యను చైర్మన్ గారి దృష్టికి తెచ్చాడు . పనివాళ్ళు వాడుకునే మరుగు దొడ్లు , మూత్రశాలలు కంపుకొడుతూ అసహ్యంగా ఉన్నాయని , పెద్ద ఉద్యోగస్తుల వాష్ రూమ్లు శుభ్రంగా తళతళా మెరిసి పోతున్నాయని ఫిర్యాదు చేసాడు . పై అధికారిని , చైర్మన్ గారు అడిగారు , " ఈ సమస్య పరిష్కరించడానికి మీకెన్ని రోజులు పడుతుంది . " " ఒక నెలలో పరిష్కరిస్తాం . " అని చెప్పాడు . ' నేను ఒక రోజులో సరిచేస్తా , ఒక వడ్రంగిని పిలిపించండి . " తర్వాత రోజు వడ్రంగి రాగానే , వాష్ రూమ్లకు ఉన్న సై బోర్డులు మార్చమన్నాడు . అంతేకాదు , ఈ సైన్ బోర్డులు ప్రతి 15 రోజులకు ఒకసారి మార్చమని ఆజ్ఞాపించారు . " ఇప్పుడు పనివాళ్ళ మరుగు దొడ్లు అధికారులవయ్యాయి , అధికారులవి పనివాళ్ళవయ్యాయి . " II మూడో రోజుకంతా పనివాళ్ళు , ఉద్యోగుల మరుగు దొడ్లు , మూత్రశాలలు ఒకే స్థాయికి వచ్చాయి . నాయకులు సమస్యలను శ్రద్ధగా , సహనంతో వింటారు . క్షణం వృధా కాకుండా పరిష్కరిస్తారు . అధికారం చెలాయించడం కాదు , నాయకత్వ లక్షణాలు అలవరచుకోవాలి . సమస్యను గుర్తించడానికి సూక్ష్మ పరిశీలన కావాలి . పరిష్కారాలు చూపించడానికి సృజనాత్మకత కావాలి .


నేను పేదవాడిని ఎందుకయ్యాను ? - #31

"ఒకసారి ఒక చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చి ఇలా అడిగాడు .. " నేను పేదవాడిని ఎందుకయ్యాను ? " బుద్ధుడు , " మీరెందుకు పేదలంటే మీలో ఎటువంటి ఔదార్యం లేదు , దానధర్మాలు చేయరు , అందుకే మీరు పేదవాళ్ళు . " " దానం చేయడానికి నా దగ్గర ఏముంది ? " అన్నాడు పేదవాడు . అప్పుడు బుద్ధుడు , " మీరు ఇతరులతో పంచుకోగల ఐదు నిధులు మీ దగ్గర ఉన్నాయి తెలుసా !!! " అన్నాడు . మొదటిది మీ ముఖం - దీనితో ఇతరులతో మీ ఆనందాలను ( నవ్వులను ) పంచుకోవచ్చు . ఇది ఖర్చు లేనిది , ఇతరులపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది ! రెండోది - మీ కళ్లు - మీరు ప్రేమ , అనురాగం పంచవచ్చు . ఇది నిజం , మీరు లక్షలాది మందిని మీ చూపుతో ప్రభావితం చేయవచ్చు ! మూడోది మీ నోరు - ఈ నోటితో ఇతరులకు మంచి విషయాలు చెప్పి , మంచి విషయాలు చర్చించి , విలువైన వ్యక్తులుగా మార్చవచ్చు . దానితో ఆనందం వెల్లివిరుస్తుంది . నాలుగోది - మీకుంది ఒక అద్భుతమైన గుండె - మీ దయగల హృదయంతో , ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు . ఇతరుల భావోద్వేగాలకు అనుభూతి చెందవచ్చు . వారి జీవితాలను స్పృశించవచ్చు . మీకున్న ఐదవ సంపద మీ శరీరం - ఈ శరీరంతో మీరు ఎన్నో మంచి పనులు చేయవచ్చు . అవసరమైన వారికి చేతనైన సహాయం చేయవచ్చు . సహాయానికి డబ్బే అవసరం లేదు . ఒక చిన్న శ్రద్ధ , ప్రేమ జీవితాలను వెలిగిస్తాయి . ఈ జీవితం , కలకానిది ! విలువైనది ! సర్వోత్తమమైనది ! ఆనందంగా ఉంటూ , చేతనైన సహాయం చేస్తూ , జన్మను చరితార్థం చేసుకోవడమే మానవ జన్మకు సార్థకత


పదునైన_వ్యక్తిత్వానికి # పదిహేడు_సూత్రాలు - #30

1 ) విలువ లేని చోట మాట్లాడకు .
2 ) గౌరవం లేని చోట నిలబడకు .
3 ) ప్రేమ లేని చోట ఆశ పడకు .
4 ) నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకి క్షమాపణ చెప్పకు
5 ) నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు .
6 ) నిర్లక్ష్యం వున్న చోట ఎదురు చూడకు .
7 ) అలక్ష్యం వున్న చోట వ్యక్త పరచకు .
8 ) వ్యక్తిత్వం తాకట్టు పెట్టి పాకులాడకు .
9 ) ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు .
10 ) చులకనగా చూసే చోట చొరవ చూపకు .
11 ) జాలి పడి ఇచ్చే పలకరింపులకి , ప్రేమకి జోలె పట్టకు .
12 ) భారం అనుకునే చోట భావాలు పంచుకోకు .
13 ) దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు .
14 ) నిజాయతీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు .
15 ) ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి వుంటుందని భ్రమ పడకు .
16 ) ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు .
17 ) నీది కాని దేని మీదా నిన్ను తినేసేంత ప్రేమ , నీ పెంచుకోకు .


Life Changing - #29

గద్ద ఎత్తైన చెట్టు మీదో , కొమ్మ మీదో గూడు కట్టుకుంటుంది.ఆ గూటిలో ముళ్ళు , పదునైన రాళ్ల వంటివాటితో మొదటి వరస నింపుతుంది . ఆ తర్వాత రెండవ వరసగా చిన్న చిన్న కట్టె పుల్లలు , ఈకలు జంతువుల వెంట్రుకలతో కప్పి ఉంచుతుంది . గద్ద పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల చుట్టూ ఈ మెత్తటి పొర సౌకర్యవంతమైన రక్షణగా ఉంటుంది . పిల్లలు కొంచెం కొంచెం పెద్దెతుంటే తల్లి గద్ద , గూడునంతటినీ కలిపేస్తుంది . ఇప్పుడు గూడు మెత్తగా లేక ముళ్ళు , రాళ్ళు గుచ్చుకొని బాధ పెడుతుంటాయి . నెమ్మదిగా పిల్లలకు ఆహారం అందించడం కూడా ఆపేస్తుంది . అంతకాలం అనుభవిస్తున్న సౌకర్యవంతమైన జీవితం కష్టతరంగా మారిపోతుంది . ఒకవైపు ముళ్ళు పదునైన రాళ్లు గుచ్చుకొంటుంటే , ఇంకొక వైపు భరించలేని ఆకలి బాధ తట్టుకోలేక పిల్లలు బయటికి వచ్చి కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ఎగిరిపోతాయి . మన జీవితంలో కూడా , ఆర్థిక ఇబ్బందులూ , బంధువులతో సమస్యలు , ఆరోగ్య సమస్యల వంటి వాటితో కొట్టుమిట్టాడుతుంటాం . ఈ కష్టాలు తట్టుకుంటేనే జీవితం సాఫీగా సాగిపోతుంది .


ధ్యానం - #28

గురువు గారు , ఆయన శిష్యులు ప్రతిరోజూ సాయంత్రం పూట ఆశ్రమంలో ధ్యానం చేసుకుంటూ ఉంటారు . అదే సమయానికి ఒక పిల్లి వచ్చి నానా అల్లరి చేస్తూ ఉండేది . దాని గోల వల్ల ధ్యానానికి భంగం కలిగేది . గురువు గారు దాని అల్లరి భరించలేక ఎక్కడైనా కట్టేయమన్నాడు . ఆనాటి నుండి ధ్యానం సమయంలో పిల్లిని కట్టేయడం ఆనవాయితీగా మారింది . కొన్నాళ్ళకు గురువు గారు పరమపదించారు . ఆ పిల్లీ చనిపోయింది . కాని ప్రతి రోజూ ధ్యానం చేసే సమయానికి ఒక పిల్లిని కట్టేస్తూనే ఉన్నారు . వందలు , వేలు సంవత్సరాలు గడిచిపోయాయి అయినా ఆశ్రమాల్లో పిల్లిని కట్టేస్తూనే ఉన్నారు . ఎందరో మహానుభావులు ధ్యాన సమయంలో పిల్లిని కట్టేయడం వెనక ఉన్న ఆధ్యాత్మికత గురించి గొప్పగా గ్రంథాలు రాసారు . ( ప్రజలు తామేం చేస్తున్నారనే విషయం గురించి ఆలోచించరు . ప్రతి ఒక్కరూ అలాగే చేస్తున్నారు కాబట్టి అందరూ అలాగే చేస్తారు . మనలో చాలామంది మన జీవితాలను కూడా అలాగే గడిపేస్తాం . మనం కూడా చాలా పనులు వాటి ప్రాధాన్యత గానీ , అర్థం కానీ తెలుసుకోకుండా చేసేస్తుంటాం . మనలోని అసందర్భపు అలవాట్లకు , ఆలోచనలకు , కోరికలకు పిల్లి ప్రతీక అనుకుందాం . ఆ కోరికలను కట్టడి చేయడానికే పిల్లిని కట్టేయడం అన్న విషయాన్ని మరిచి పోతాం .


శ్రమయేవ జయతే - #27

ఆ ఊళ్ళో ఒక పెద్దమనిషికి నలుగురు కొడుకులు . ఆ నలుగురూ పరమ బద్ధకస్తులు , ఇటు పుల్ల తీసి అటు పెట్టరు . ఆ వృద్ధుడు కొన్నాళ్ళకు అనారోగ్యం పాలయ్యాడు . సోమరిపోతులైన కొడుకులు ఏమైపోతారో అని ఆందోళన చెంది నలుగురినీ పిలిచి , తన దగ్గర చాలా బంగారం , నిధినిక్షేపాలు ఉన్నాయని , కానీ అవి ఎక్కడ పెట్టాడో మరిచిపోయానని , అయితే వాటిని పొలంలోనే ఎక్కడో ఒక చోట దాచిపెట్టానని చెప్పాడు . కొడుకులు నిరాశ చెందారు . కొన్నాళ్ళకే వృద్ధుడు మరణించాడు . ఆ తర్వాత ఆ నలుగురూ పొలాన్ని తవ్వి నిధి నిక్షేపాలు వెతకాలని నిశ్చయించుకొని , చాలా కష్టపడి పొలాన్ని బాగా గుల్లగా తవ్వారు . ఒక మూల లోతుగా తవ్వితే నీళ్ళు కూడా పడ్డాయి . అటు వైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి బాగా తవ్విన నేలను , నీటివసతిని చూసి సరిగ్గా సాగుచేస్తే మంచి పంట పండుతుందని చెప్పాడు . నలుగురూ ఆ పొలంలో కూరగాయలు , పూల మొక్కల వంటివి పెంచడం మొదలు పెట్టారు . కొన్ని వారాలకు మంచి దిగుబడి వచ్చింది . దాన్ని అమ్మగా లాభాలు కూడా బాగానే వచ్చాయి . ఆ అన్నదమ్ములకు శ్రమించడమే అసలు నిధి అని అర్థమైంది . ఆనాటి నుండి సుఖంగా , సంతోషంగా జీవించడం నేర్చుకున్నారు . ఆర్థికంగా నిలదొక్కుకున్నారు . కృషితో నాస్తి దుర్భిక్షం .


ఆ కంపెనీ మేనేజర్ తో ఒక సేల్స్ రిప్రజంటేటివ్ - #26

ఆ కంపెనీ మేనేజర్ తో ఒక సేల్స్ రిప్రజంటేటివ్ , ఒక గుమాస్తా , మధ్యాహ్న భోజనానికి హోటల్ కు బయల్దేరారు . దారిలో వాళ్ళకు పాతకాలం నాటి దీపం ఒకటి దొరికింది . దాన్ని చేత్తో గట్టిగా రుద్దితే ఒక భూతం బయటికి వచ్చి " మీ ముగ్గురికి మూడు వరాలు ఇస్తాను . కోరుకోండి . " అనింది . గుమాస్తా చొరవగా " నేనడుగుతా .. నేనడుగుతా .. " అంటూ " bahama దీవుల్లో నా ఇష్టం వచ్చినంత కాలం ఆనందంగా గడపాలి . " అన్నాడు . అంతే గుమాస్తా మాయమైపోయాడు . తర్వాత సేల్స్ రిప్రజెంటేటివ్ " హవాయి దీవి బీచ్లో మసాజ్ చేయించుకుంటూ కొన్నాళ్ళు ఆనందంగా గడపాలని ఉంది . " అంతే రిప్రజెంటేటివ్ కూడా మాయమై పోయాడు . ' చివరగా మేనేజర్ వంతు వచ్చింది . " భోజనాలు అయిన తర్వాత ఆ ఇద్దరూ నా ఆఫీస్లో ఉండాలి " మానేజ్ మెంట్ సూత్రం = - మొదటి అవకాశం ఎప్పుడూ బాస్ కే ఇవ్వాలి .


దైవభక్తి - #25

ఊరిని వరదలు ముంచెత్తాయి . ఊరొదిలి చాలా మంది ప్రాణాలు కాపాడుకున్నారు . ఇళ్ళు కూలిపోయాయి , కొట్టుకు పోయాయి . కొద్ది మంది ఒక ఇంటి పైకప్పెక్కి సహాయం కోసం ఆర్తనాదాలు చేసారు . ఒక భక్తుడు కూడా రక్షించమని దైవప్రార్ధన చేస్తూ కూర్చున్నాడు . ఇంతలో ఒక పడవ వస్తే అందులో చాలా మంది వెళ్లి పోయారు . భక్తుడు మాత్రం దేవుడు రక్షించక పోతాడాని ఆ పడవ ఎక్కలేదు . మరుసటిరోజు ఇంకొక పడవ వచ్చింది . భక్తుడిని పడవ ఎక్కమని బ్రతిమాలారు . ' నా దేవుడు నన్ను రక్షిస్తాడ'ని పడవ ఎక్కలేదు . మూడో రోజు ఇంకో పడవ వచ్చినా దేవుడే నన్ను రక్షించుకొంటాడని మళ్ళీ తిరస్కరించాడు . తర్వాత రక్షించడానికి ఎవ్వరూ రాలేదు . ఆకలిదప్పులతో జబ్బున పడి ఆ భక్తుడు చనిపోయాడు . చనిపోయిన తర్వాత దేవుడిని కలిసి కోపంతో " నేను నిన్నే నమ్ముకున్నాను , నిరంతరం పూజించాను . కష్టకాలంలో నన్ను నీవు ఆదుకోలేదు " అని నిష్టూరంగా నిందించాడు . అప్పుడు దేవుడు " పిచ్చివాడా !! నీ కోసం మూడు సార్లు పడవలను పంపించాను . అన్నిటినీ తిరస్కరించి , నా సహాయం ఒద్దనుకొని చనిపోయావు . నేను నీకు ఎన్ని - ప్రయత్నం చేసినా నీవే అందుకోలేదు , మూఢుడా !! " . ( దైవభక్తి ఉండాల్సిందే , కానీ సమయసందర్భాలను బట్టి అవకాశాలు వాడుకోకపోతే మూఢులుగా మిగిలిపోతారు . )


Family - #24

" చాలా ఏళ్ళ నుండి అన్నదమ్ములిద్దరూ పక్క పక్క పొలాల్లో అన్యోన్యంగా వ్యవసాయం చేసుకొని జీవించేవాళ్ళు . ఒకరోజు ఎందుకో ఒకరి మీద ఒకరికి కోపం వచ్చింది . మాటామాటా అనుకున్నారు , తిట్టుకున్నారు . అంతటి స్నేహం తెగి పోయింది . మాటలు లేవు . శత్రువులుగా మారిపోయారు . ఇద్దరి పొలాల మధ్య తమ్ముడు కాలవ తొవ్వించి వైరాన్ని మరింత పెంచాడు . ఒకరోజు ఒకతను , అన్న ఇంటికి వచ్చి " నేను వడ్రంగిని . ఏదైనా పని ఇప్పించండి . చేసి పెడతాను , మీకు తోచింది ఇవ్వండి . " అని ప్రాధేయపడ్డాడు . " కోపం వచ్చి మా తమ్ముడు ఈ రెండు పొలాల మధ్య ఈ కాలవ తవ్వించాడు . నాతో మాట్లాడడం లేదు . నేను వాడి మొహం కూడా చూడకూడదని అనుకొంటున్నాను . అదుగో చెక్క ముక్కలు , వాటితో వాడి మొహం చూసే అవసరం లేకుండా ఎత్తైన పెద్ద కంచె కట్టు . నాకు చిన్న పని ఉంది . సాయంత్రానికి వస్తాను " అంటూ వెళ్లిపోయాడు . వడ్రంగి పనిముట్లు తీసుకుని రోజంతా కష్టపడి పని చేసాడు . సాయంత్రానికి అన్న వచ్చి చూసేసరికి అక్కడ కంచె లేదు సరికదా ! కాలవను కలుపుతూ వంతెన కనిపించింది . అంతేకాదు అటు నుండి ఆనందంగా తమ్ముడు వచ్చి అన్నను కౌగలించుకొని " అన్నయ్యా ! నిన్ను ఎన్నిమాటలన్నాను . అయినా కూడా నీవు వంతెన కట్టించావంటే ఎంత మంచి వాడివన్నా ! " అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకొన్నాడు . వడ్రంగిని అక్కడే ఉండి పని చేసుకోమన్నారు . " క్షమించండి , నేను కట్టాల్సిన వంతెనలు చాలా ఉన్నాయి "


Presence of mind - #23

ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం ( Relative Theory ) గురించి అనేక విశ్వవిద్యాలయాలలో ఉపన్యాసాలు ఇచ్చేవాడు . అతనితో పాటు అతని నమ్మకస్తుడైన కారు డ్రైవర్ , ' హ్యారీ ' కూడా ఉండేవాడు . ఆడిటోరియంలో ప్రతిసారీ వెనక బెంచీలో కూర్చుని ఐన్స్టీన్ ఉపన్యాసాలు వినేవాడు . ఒక రోజు డ్రైవర్ హ్యారీ ఐన్స్టీన్ తో " ప్రొఫెసర్ మీ ఉపన్యాసాలు ఎన్నో సార్లు విన్నాను , నాకు కంఠతా వచ్చు , అవకాశం ఇస్తే ఆ ఉపన్యాసం తు.చ. తప్పకుండా నేను కూడా ఇవ్వగలను . " 11 వచ్చే వారం డార్ట్ మౌత్ అనే ప్రాంతానికి వెళ్తున్నాం . అక్కడ నన్నెవరూ గుర్తు పట్టరు . నా బదులు నువ్వు ఉపన్యాసం ఇవ్వు . నేను డ్రైవర్ డ్రెస్ లో వెనక బెంచీలో కూర్చుని వింటా " అని ఐన్స్టీన్ ప్రోత్సహించాడు . హ్యారీ , ఐన్స్టీన్ బదులుగా ఉపన్యాసం , పొల్లు పోకుండా ఇచ్చాడు . ఇంతలో ఒక ప్రొఫెసర్ ఒక కఠినమైన ప్రశ్న హ్యారీని అడిగాడు . హ్యారీ తడుముకోకుండా , " ఇంత చిన్న ప్రశ్నకు జవాబు మా డ్రైవర్ ఇస్తాడు " అంటూ దిగి పోయాడు . అదీ సమయస్పూర్తి , ( Presence of mind ) అంటే .


బంధం - #22

ఒక రోజు ఉద్యోగులందరూ ఆఫీస్ కు వెళ్లేసరికి తలుపు మీద ఉన్న నోటీసులో , " ఈ సంస్థలో ఇన్నాళ్లూ మీ అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి నిన్ననే చనిపోయాడు . వ్యాయామశాలలో ఆ వ్యక్తి పార్థివదేహం ఉంది , వెళ్లి చూడవచ్చు . " తమ సహోద్యోగి ఎవరో మరణించారన్న వార్త వారిని బాధపెట్టింది . ' ఎవరా ' అని కుతూహలం కలిగింది . తమ అభివృద్ధికి , కంపెనీ ఎదుగుదలకు అడ్డుపడ్డ వ్యక్తిని తెలుసుకోవాలన్న కోరికతో వ్యాయామశాలకి చేరుకున్న ఉద్యోగుల్లో ఉద్వేగం , ఉత్సుకత పెరిగిపోయాయి . ' నా అభివృద్ధికి అడ్డుపడింది ఎవరు , పోనీలే అతనుచనిపోయాడు కదా ' అని మనసులో ఆనందపడ్డారు . శవపేటికలోకి తొంగి చూసిన ఉద్యోగులకు నోట మాట రాలేదు . దిగ్భ్రాంతికి లోనయ్యారు . మౌనంగా ఉండిపోయారు . శవపేటికలో ఒక అద్దం ఉంది ... దాని లోకి తొంగి చూసిన వాళ్లకి వాళ్ల ప్రతిబింబమే కనిపించింది అద్దం పక్కనే ఒక కాయితం అతికించి ఉంది . ( " మీ అభివృద్ధిని అడ్డుకునే సామర్థ్యం మీ ఒక్కరికే ఉంది . మీ జీవితాన్ని ఊహించని విధంగా మార్చుకోగల వ్యక్తి మీరే . మీ ఆనందాన్ని , విజయాన్ని , స్వశక్తిని ప్రభావితం చేయగల వ్యక్తి కూడా మీరొక్కరే . ఇంకా మీకు మీరు సహాయం చేసుకో గల ఒకే ఒక వ్యక్తి మీరే . మీలో మార్పు వస్తేనే మీ జీవితంలో మార్పు వస్తుంది . మీ జీవితానికి బాధ్యత వహించాల్సిన వ్యక్తి మీరొక్కరే ... " మీరు ఏర్పరుచుకోగల అతి ముఖ్యమైన బంధం , ' మీతో మీరు ఏర్పరుచుకునేది . '


ఒక రైతు దగ్గర ఒక కుక్క ఉండేది - #21

ఒక రైతు దగ్గర ఒక కుక్క ఉండేది . అది రోడ్డు మీద పోయే ప్రతి బండి వెనక మొరుగుతూ వెంబడించి దాన్ని దాటి ముందుకు వెళ్ళాలని శక్తి కొద్దీ పరుగెత్తేది . ఒక రోజు ఆ రైతు స్నేహితుడొకరు , " మీ కుక్క ఎప్పటికైనా ఆ వేగంగా వెళ్లే కార్లు , లారీలను దాటి ముందుకు వెళ్ళగలుగుతుందా !! " " " అది దాటి పోగలదో , లేదో చెప్పలేను కానీ , ఏదైనా ఒక బండిని దాటి పోయిన తరవాత అది ఏం చేస్తుంది , అన్నదే నా సందేహం !!! " అన్నాడు రైతు . ( చాలా మంది తమ జీవితాల్లో కూడా ఆ కుక్క మాదిరే అర్థం పర్థం లేని లక్ష్యాల వెంబడి నిరర్ధకంగా పరుగెత్తుతుంటారు . జూదం వంటి వ్యసనాల వెంబడి నిరంతరం పరిగెత్తే వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే . జీవితాన్నే జూదంగా మార్చుకొనే వాళ్ళు మరి కొందరు . )


ఒకప్పుడు .. ఇప్పుడు - #20

నిజాయితీ : ఒకప్పుడు .. మంచితనం ఇప్పుడు చేతకానితనం
మోసం : ఒకప్పుడు .. తప్పు , ఇప్పుడు .. తెలివి
గెలుపు : ఒకప్పుడు .. తెలివికి బలగానికి విలువ , ఇప్పుడు .. పక్కవాడిని మోసం చేస్తే వచ్చే రాబడి
సహాయం : ఒకప్పుడు .. నిస్సహాయుడికి చేసేది ఇప్పుడు ... తిరిగి సహాయాన్ని ఆశించి చేసేది
కోపం : ఒకప్పుడు .. తప్పుని చూస్తే కలిగేది ఇప్పుడు ..
బలహీనుడు మీద మాత్రమే కలుగుతుంది
ద్రోహం : ఒకప్పుడు .. నేరం , ఇప్పుడు నమ్మినవాడికి దక్కే సత్కారం


గురువు - #19

ఒక ఉపాధ్యాయుడిని ఎవరో అడిగారు , " గురువుగా ఉండటం మీరు ఎందుకు గర్వంగా ఫీలవుతారు ? ? ? " " అందుకా ఉపాధ్యాయుడు నవ్వుతూ .... , " ఒక న్యాయవాది ఆదాయం సమాజంలో నేరాలు , వ్యాజ్యాల పెరుగుదలతో పెరుగుతుంది . ఒక వైద్యుని ఆదాయం ప్రజల వ్యాధి / అనారోగ్యాల పెరుగుదలతో పెరుగుతుంది . కానీ ... మా ( గురువు ) ఆదాయం మాత్రం .. ప్రజల జ్ఞానం , శ్రేయస్సు , దేశాభివృద్ధి పెరుగుదలతో పెరుగుతుంది ... !!!
" YES " ******* * అందుకే ఉపాధ్యాయులుగా గర్విస్తాం ! * * మేం పంతుళ్ళం కాదు ... * * మేం " తరాల " తయారీదారులం ... * * ( Teachers : Makers of Generations ) *


Life Change - #18

రఫెల్ సోలెనో , గ్లుమ్లీ మరి కొందరు కలిసి 1942 లో వెనిజులా నదీతీరంలో , గులకరాళ్ళ మధ్య వజ్రాల కోసం వెతుకుతున్నారు . ఎన్ని సంవత్సరాలు వెతికినా వాళ్లకు ఒక్క వజ్రం కూడా దొరకలేదు . బట్టలు చిరిగిపోయాయి . శరీరాలు మట్టికొట్టుకు పోయాయి . చివరకు విసిగిపోయి రఫెల్ సోలెనో " ఇక నాకు వెతికే ఓపిక , శక్తి లేవు . వజ్రాలు దొరుకుతాయన్న నమ్మకమూ లేదు . నేను మానేస్తాను . " అన్నాడు " ఇంకొకసారి ట్రై చెయ్ మిలియనియర్ అవుతావేమో " అన్నాడు గ్లుమ్లీ . ఈసారి రఫెల్ సోలెనో గులకరాళ్ళలో చెయ్యి పెట్టి ఒక రాయి తీసి ' ఇది దొరికింది అన్నాడు . అది బరువుగా కోడిగుడ్డంత ఉంది . దాన్ని చూసి కెవ్వున కేక్ పెట్టారు . అది నిజంగా వజ్రమే ... దాన్ని న్యూయార్క్ లోని వర్తకుడు రెండు లక్షల డాలర్లకు కొన్నాడు . అది స్వఛ్ఛమైనది , బరువైనది , చాలా పెద్దది . తరవాత దానికి LIBERATOR అని పేరు పెట్టారు . ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఆరోజు సోలనో ' నాకు చేతకాదు ' ' నేను వెతకలేను , ' ఇది కష్టం ' అని తప్పుకొని ఉంటే లక్షాధికారి అయ్యేవాడుకాడు . జీవితంలో ఎదురయ్యే ఓటములలో సగం ఓటములు మధ్యలో విరమించు కోవడం వల్లనే . అందుకే ' జయమ్ము నిశ్చయమ్మురా , భయమ్ము లేదురా , జంకుగొంకులేక సాగిపొమ్మురా ' అన్నాడో సినీ కవి .


బ్రిడ్జి దాటుతున్న ఏనుగును చూసి ఒక దోమ - #17

బ్రిడ్జి దాటుతున్న ఏనుగును చూసి ఒక దోమ , " లిఫ్ట్ ఇస్తావా , నీ వీపు మీద కూర్చుని ఈ వంతెన దాటే వరకూ నీకు కంపెనీ ఇస్తా . " ఏనుగు మాట్లాడలేదు . ఏనుగును ఒప్పించి దానిపై కూర్చున్నానన్న దర్జాతో దోమ జాగ్రత్త మిత్రమా !!! ఇద్దరి బరువు బ్రిడ్జి మోయలేదేమో ! " 11 ఏనుగు ఇప్పుడు కూడా ఏం మాట్లాడలేదు . బ్రిడ్జి దాటుతుండగా ఏనుగుతో గర్వంగా చెప్పింది , " చూసావా ! నీవు జాగ్రత్తగా దాటడానికి ఎంత సహకరించానో ! " ఏనుగు నిశ్శబ్దంగా ఉండిపోయింది . చివరికి దోమ ఏనుగు వీపు పైనుండి ఎగిరి , " ఇది నా బిజినెస్ కార్డు , నీకేమైనా సహాయం కావాలంటే నా సెల్ నం.కు ఫోన్ చెయ్యి . " ఏనుగుకు దోమ జుయ్ మన్న శబ్ధం మాత్రం వినిపించింది , ఏనుగు తనదారిన తాను వెళ్లి పోయింది . 1. మీరు అద్భుతమైన లక్షణాలున్న ఏనుగు లాంటి వారు , మీమీద మీకు సంపూర్ణ ఆధిపత్యం ఉన్నవాళ్ళు . దోమల్లాంటి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు , విమర్శిస్తుంటారు , అవహేళన చేస్తుంటారు . తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మీకు మీరే బాస్ , మీ ఆనందాన్ని ఎవ్వరూ హరించలేరు . ఇటువంటి వాళ్ళను పట్టించుకోకుండా ముందుకు సాగి పోవాలి . మీ జీవిత లక్ష్యాన్ని జుర్రే దోమలాంటిది మీ అహం ( Ego ) . అహాన్ని ఒదిలితే ఏనుగులాంటి జీవితం మీదే .


నరహరి నిత్య నిపఠము - #16

అనవసరంగా ఎవరితోనూ మాట్లాడవద్దు .
అనవసర విషయాలలో జోక్యం కల్పించుకోవద్దు .
అనవసరంగా ఏదీ రాద్ధాంతం చేయొద్దు .
అనవసరమైనవన్నీ కొనడానికి పోవద్దు .
అనవసరమైన మాటలను నోరు జారొద్దు .
అనవసరమైన పనులలో సమయం గడపొద్దు .
ఇలా జీవితంలో అనవసరమైనవన్నీ పక్కకు పెట్టేస్తూ పోతే ఎంతో సమయం ఆదా అవుతుంది .
అనవసరమైనవన్నీ దూరంగా ఉండిపోతాయి .
అవసరమైనవి మాత్రమే నీ దగ్గరకు చేరుతాయి .
జీవితం హాయిగా నిశ్చింతగా ఉంటుంది .


Happy Life - #15

ఒక పొడవైన గాజుసీసా నిండా బియ్యపు గింజలు పోసి ఆ సీసా పైభాగాన ఒక ఎలుకను వదిలారు . ఆ గింజల కుప్ప చూసి ఎలుక చాలా ఆనందపడి , సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయింది . ఎక్కడెక్కడో తిరిగి ఆహారాన్ని సంపాదించుకోవలసిన అగత్యం లేదని మురిసిపోయింది . ప్రతిరోజూ ఆ గింజలు తింటూ సుఖంగా గడిపేస్తోంది . కొన్నాళ్ళకి ఆ గింజలన్నీ అయిపోవస్తూ సీసా అడుక్కు చేరింది . ఉన్న కొద్ది గింజల్ని తినేస్తోంది . ఇక గింజలు పోసేవారు లేరు . ఆ మిగిలిన గింజలు దాని ప్రాణాలను కాపాడలేవు . సీసా నుండి బయటికి వచ్చే మార్గం కూడా లేదు . ప్రాణాలతో ఉండాలంటే సీసాలో మళ్లీ గింజలు గాని ఆహారం కానీ వెయ్యాలి ... ఎవరు వేస్తారు !! అందుకే .... ఉచితంగా ప్రభుత్వాలు ఇచ్చే తాయిలాలపై ఆధారపడి జీవితాలు గడపకండి . మీ నైపుణ్యాలు , సృజనాత్మకత పెంచుకుంటూ , ఆర్థిక స్థితిగతులను మెరుగు పరుచుకుని ఆనందంగా , ఆరోగ్యంగా స్వేచ్ఛగా జీవించండి .


భగవద్గీత - #14

ఎవ్వరు ఎంత హేళన చేసినా నీవు తొందర పడకు హేళన చేసిన వారితోనే .. సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది .. ఓర్పుతో ఉండు నీ నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది .
భగవద్గీత


అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే తెలివైనవారి పని - #13

ఓ యువకుడు ఒక రైతు కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు . రైతు ఒప్పుకొని ఒక చిన్న పరీక్ష పెట్టాడు . " బాబూ , ఇదుగో ఈ పొలం చివర నిలబడు . నేను అటు నుండి వరసగా మూడు ఎద్దులను ఒకదాని తరవాత ఒకటి వదుల్తాను . ఏ ఒక్కదాని తోక పట్టుకొన్నా నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను . " దానికి యువకుడు ఒప్పుకొన్నాడు . యువకుడు పొలంలో ఒక చివరన నిలబడ్డాడు , ఒడుపుగా ఎద్దు తోక పట్టుకుందామని . వైపు నుండి రైతు ఒక ఎద్దును ఒదిలి పెట్టాడు . బలిష్టంగా అంత ఎత్తున్న ఎద్దు రంకెలేస్తూ వచ్చింది . దాన్ని చూసి యువకుడు బెదిరి పోయి పక్కకు తప్పుకొని , తరవాత ఎద్దు కోసం ఎదురు చూసాడు . అది మొదటి దానికన్నా భయంకరంగా ఉంది . బుసలు కొడుతూ , రంకెలేస్తూ ముందుకు దూసుకొచ్చింది . ప్రాణాలు అరచేత పట్టుకుని మూడో ఎద్దు కోసం ఎదురు చూసాడు . మూడోది బక్కపల్చగా గాలి వీస్తే చచ్చేట్లుగా ఉంది . ఆనందంగా అమాంతం ఆ ఎద్దు మీదికి ఎగిరి కూర్చుని తోక పట్టుకుందామని చూసాడు , ఆశ్చర్యంగా దానికి తోక లేదు .( జీవితంలో వచ్చే అవకాశాలలో కొన్ని సులువుగా , మరికొన్ని కఠినంగా ఉంటాయి . ఇంకో మంచి అవకాశం రాకపోతుందా అని , కనిపిస్తున్నదాన్ని ఒదిలేస్తే , మంచి అవకాశం మళ్ళీ రాదు . అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే తెలివైనవారి పని . )


"ఊరు బోసిపోయింది" - #12

పశువులు కాసేటోడు లేక పశువుల కొట్టం బోసిపోయింది...
పొలం దున్నేటోడు లేక నేలతల్లి బీడుబారింది...
పలకరించే నాధుడు లేక తాత ముఖంలో నవ్వు కరువయ్యింది...
సదువుల బాట బట్టి అల్లరి చేసే పిల్లలు లేక ఊరి బాట బోసిపోయింది...
ఉద్యోగమంటూ పట్నం బాట బట్టిన బిడ్డలు ఎప్పుడొస్తారని ఎర్రబస్సు ఎదురు చూస్తోంది.
.. అవ్వ తాతను సూసొస్తమంటూ సెలవు అడిగితే ఉన్న ఉద్యోగం పోతదన్న భయంతో నోరు మూగబోయింది...
పట్నంలో పలకరిచ్చేటోడు లేక జీవితం మోడు బారిపోయింది...
ప్రేమానురాగాలు మాసిపోయినవి... ఇది నవజీవనం...చుకోకు

ఒక మనిషి మరో మనిషికి సూటవడు - #11

నువ్వు స్లోగా వుంటే - bc కాలం నాటి వాడవని
ఫాస్ట్ గా వుంటే - మరీ స్పీడ్ అని
ఆత్మవిశ్వాసం ప్రదర్శితే అహంకారమని
భాధ పడితే -పిరికి వాడవని
జాగ్రత్త గుంటే .. పిసినారి వని
ఖర్చు పెడితే ... ఆడంభరం అని
అనుమానిస్తే .... ఎవరినీ నమ్మడని
నమ్మితే .... అమాయకుడవని
మంచిగా వుంటే ... చేతగాని వాడవని
ఆవేదనతో అరిస్తే .... పొగరని
ఇలా చాల సందర్భాలలో , అపార్థం చేసుకొనే వారే ఎక్కువ ఇక నీ తీరు స్థిరంగా లేకపోతే , అలా అనుకోవడం ఇంకా ఎక్కువ
కాబట్టి మరీ ఓవర్ గా ఇతరుల అభిప్రాయం పట్టించుకోకు

మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు.. - #10

కారు ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టేఫినీ ఉందికానీ తనకు వెయ్యడం రాదు . రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు . సమయం చూస్తే సాయంత్రం ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన . ఒక్కతే ఉంది . తోడు ఎవరూ లేరు . చీకటి పడితే ఎలా? దగ్గరలో ఇళ్ళు లేవు . సెల్ పనిచెయ్యడం లేదు ( సిగ్నల్స్ లేవు ). ఎవరూ కారునూ , పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు . అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది . ఎలారా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది . చలి కూడా పెరుగుతోంది .. అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది . ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటం తో ఆమె సహజంగా భయపడుతుంది.....ఎవరతను ?ఎందుకు వస్తున్నాడు ? ఏమి చేస్తాడు .? ఆందోళన !. అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు ? టైర్ లో గాలి లేదని చూశాడు . ఆమె బెదిరిపోతోందని గ్రహించాడు ." భయపడకండి . నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను . బాగా చలిగా ఉంది కదా ! మీరు కారులో కూర్చోండి . నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు ఆమె భయపడుతూనే ఉంది . " నా పేరు బ్రియాన్. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను " అన్నాడు .అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని కారు కిందకి దూరి జాకీ బిగించాడు . తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు . సామాను తిరిగి కారులో పెట్టాడు .. ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు ." మీరు కాదనకండి . మీరు ఈ సహాయం చెయ్యక పోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది" అంది. " నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు . మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి " అని వెళ్లి పోయాడు... మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది . అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది . తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది . ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి ... అదొక చిన్న హోటల్ . కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది . ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది . డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది . బరువుగా నడుస్తోంది . అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్లికావలసిన ఆర్డర్ తీసుకోవడం , సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని చిల్లర ఇవ్వడం అన్నీ తనే చేస్తోంది . ఆమె ముఖం లో ప్రశాంత మైన చిరునవ్వు.ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది . చిరు నవ్వుతో ఏమి కావాలండి ? అని అడిగింది . అంత శ్రమ పడుతూ కూడా చెరిగిపోని చిరు నవ్వు ఆమె ముఖం లో ఎలా ఉందొ ? అని ఆశ్చర్య పడుతోంది తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది . భోజనం చేసి ఆమెకు 1000నోటు ఇచ్చింది . ఆమె చిల్లర తేవడానికి వెళ్ళింది . తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు .. ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద నాలుగు 1000 నోట్లూ ఉన్నాయి . ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు .అందులో ఇలా ఉంది .." చిరు నవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది . నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది . నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ నేను నీకు సహాయ పడుతున్నాను. నువ్వూ ఇలాగే ఇతరులకు సహాయపడు . " అని రాసి ఉంది.. ఇంటికి వచ్చింది . అప్పుడే ఇంటికి వచ్చి అలసి పోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది . గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది . అతడి పక్కన మంచం మీదకు చేరుతూ మనం దిగులుపడుతున్నాం కదా డెలివరీకి డబ్బులెలాగా అని.... ఇక ఆ బెంగ తీరిపోయిందిలే బ్రియాన్! భగవంతుడే మనకు సహాయం చేశాడు . ఆయనకి కృతజ్ఞతలు అంది ప్రశాంతంగా.. మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు.. మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే చేరుతుంది అన్నది ఆ కధ యొక్క పరమార్ధం..!!🙏

మీ జీవితాన్ని మలుపు తిప్పే అద్భుతమైన మాటలు - #9

ఈ క్రింది వాఖ్యాలను ప్రతి రోజు చదవటం అలవాటు చేసుకోండి . ఇలా చదవడం వలన రోజు రోజుకు మీలో ఆత్మ విశ్వాసం పెరిగి జీవితంలో దేనినైన సాధించే శక్తి వస్తుంది
1. నేను అదృష్టాన్ని నమ్ముకోను .
2. నేను నా శ్రమనే నమ్ముకుంటాను .
3. నేను సమయ పాలనను పాటిస్తాను .
4. నేను నా సమయాన్ని వృధా చేయను .
5. నేను ఏ పనిని మధ్యలో వదిలి పెట్టను .
6. నేను ఏ పనినైన ఏకాగ్రతతో చేస్తాను .
7. నేను ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉంటాను .
8. నాలో అనంత శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి .
9. నేను ఎల్లప్పుడు ఆత్మ విశ్వాసంతో ఉంటాను .
10. నేను మార్పు చెందడానికి సిద్దంగా ఉన్నాను .
11. నేను నాయొక్క పనులను వాయిదా వేయను .
12. నేను అనుక్షణం అత్యంత చురుకుగా ఉంటాను .
13. నాలో ఏదో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది .
14. నేను ఏ పని చేసిన విజయవంతంగా చేస్తాను .
15. నేను నా జీవితంలో ఎన్నో అద్భుతాలను చేస్తాను .
16. నేను లక్షల మందికి ఆదర్శంగా తయారవుతాను .
17. నేను నా ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను .
18. నేను ప్రతి రోజు నా జీవిత లక్ష్యాన్ని గుర్తుకు చేసుకుంటాను .
19. నేను ఖచ్చితంగా ఎదో ఒక అద్భుతం చేయడానికే జన్మించాను .

విశ్వాసం - #8

ఒక శిష్యుడు తన గురువుయందుగల అపార విశ్వాసంతో గురునామస్మరణ చేస్తూ నీటిమీద నడుస్తూ వెళ్ళసాగాడు . అది చూసిన ఆ గురువు ' నా ' పేరులో ఇంతటి మహిమ ఉన్నదా ' అని అహంకరించి ' నేను , నేను ' అని నది దాటబోగా అందులో మునిగిపోయాడు . విశ్వాసం అద్భుత కార్యాలను సాధిస్తే అహంభావం వినాశనాన్ని తెచ్చిపెడుతుంది .

జీవితంలో కొన్ని అంతే .... !!!! - #6

1 చేతికి ఆయిలో , గ్రీజో అంటుకున్నప్పుడే వీపు దురద పుడుతుంది .
2 ఫ్రెండ్స్ ఆడుకుందామన్నప్పుడే అమ్మ పని చెబుతుంది .
3. నిల్చున్న క్యూ కదలట్లేదని పక్క క్యూ లైన్లోకి వెళ్ళినప్పుడే లైన్ తొందరగా కదులుతుంది .
4. స్నానం చేస్తున్నప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది .
5. సరిగ్గా సమాధానం తెలియని ప్రశ్న రాగానే మన వంతు వస్తుంది .
6. ఆఫీసుకి ఆలస్యంగా వెళ్లిన రోజే బాస్ తొందరగా వస్తాడు .
7. అర్జంటుగా వెళ్లాల్సి వచ్చినప్పుడే బస్సు తొందరగా రాదు .
8. ఇష్టమైన ప్రోగ్రాం చూస్తున్నప్పుడే కరెంటు పోతుంది .
9. ఇంట్లో సరుకులు నిండుకున్నప్పుడే బంధువులు ఇంటికి వస్తారు .
10. రాంగ్ నెంబర్ కి ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్ రాదు .

సత్సంబంధాలు - #5

భార్య పెంచుకుంటున్న పిల్లి అంటే సుబ్బారావుకు పరమ చిరాకు . ఒక రోజు దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని , ఓ పది వీధుల అవతల వదిలిపెట్టి వచ్చాడు . ఇంటికి వచ్చే సరికి అది ఇంట్లో ఉంది ఆశ్చర్యంగా !! ఈసారి పిల్లిని ఇరవై వీధుల అవతల వదిలిపెట్టి వచ్చాడు . ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అది ఇంట్లో ఉంది . ఎంత దూరం తీసుకెళ్లినా , ఎన్ని దారులు మార్చినా మళ్ళీ ఇంటికి వచ్చేస్తూనే ఉంది . చివరికి వీధుల్లో రకరకాలుగా తిప్పి , వంతెనలెక్కించి ఎక్కడో దూరంగా వదిలేసాడు . ఇంక పిల్లి ఇంటికి రాదని నిర్ధారణ చేసుకొని గంట తర్వాత భార్యకు ఫోన్ చేసి అడిగాడు ' పిల్లి వచ్చిందా ' అని . ' ఒచ్చింది గానీ మీరెక్కడ తగలడ్డారు . ' నిస్పృహతో " ఫోన్ దానికివ్వు . నేను దారి తప్పి పోయాను . ఇంటికి ఎలా రావాలో దాన్నే అడగాలి . " ( ఎవరినైనా మనం తీవ్రంగా అయిష్ట పడవచ్చు , కానీ ఏదో ఒక సమయంలో మనకు వారి అవసరం పడవచ్చు . కాబట్టి మిమ్మల్ని ఎంతమంది ఇష్టపడకపోయినా పట్టించుకోవద్దు . మీకు సంబంధించిన వారందరితో సత్సంబంధాలు కలిగి ఉండండి . )

జీవితం - #4

గద్ద ఎత్తైన చెట్టు మీదో , కొమ్మ మీదో గూడు కట్టుకుంటుంది.ఆ గూటిలో ముళ్ళు , పదునైన రాళ్ల వంటివాటితో మొదటి వరస నింపుతుంది . ఆ తర్వాత రెండవ వరసగా చిన్న చిన్న కట్టె పుల్లలు , ఈకలు జంతువుల వెంట్రుకలతో కప్పి ఉంచుతుంది . గద్ద పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల చుట్టూ ఈ మెత్తటి పొర సౌకర్యవంతమైన రక్షణగా ఉంటుంది . పిల్లలు కొంచెం కొంచెం పెద్దెతుంటే తల్లి గద్ద , గూడునంతటినీ కలిపేస్తుంది . ఇప్పుడు గూడు మెత్తగా లేక ముళ్ళు , రాళ్ళు గుచ్చుకొని బాధ పెడుతుంటాయి . నెమ్మదిగా పిల్లలకు ఆహారం అందించడం కూడా ఆపేస్తుంది . అంతకాలం అనుభవిస్తున్న సౌకర్యవంతమైన జీవితం కష్టతరంగా మారిపోతుంది . ఒకవైపు ముళ్ళు పదునైన రాళ్లు గుచ్చుకొంటుంటే , ఇంకొక వైపు భరించలేని ఆకలి బాధ తట్టుకోలేక పిల్లలు బయటికి వచ్చి కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ఎగిరిపోతాయి . మన జీవితంలో కూడా , ఆర్థిక ఇబ్బందులూ , బంధువులతో సమస్యలు , ఆరోగ్య సమస్యల వంటి వాటితో కొట్టుమిట్టాడుతుంటాం . ఈ కష్టాలు తట్టుకుంటేనే జీవితం సాఫీగా సాగిపోతుంది .

Comfort Zone - #3

రాజు గారికి రాజసం ఉట్టిపడే , రెండు అందమైన డేగలను ఎవరో బహుకరించారు . అరుదైన ఆ డేగలకు శిక్షణ ఇప్పించాడు . శిక్షణ తరవాత అందులో ఒక డేగ హాయిగా , హుందాగా ఆకాశంలో విహరిస్తోంది . రెండో డేగ ఒక చెట్టుకొమ్మ మీద కదలకుండా కూర్చుని ఉంది . రెండో డేగకు ఏమైందో ఎవ్వరికీ అర్థం కాలేదు . పక్షి వైద్యులకు , జ్యోతిష్యులకు అందరికీ చూపించారు . ఎవ్వరూ దాన్ని ఎగిరేట్లు చేయలేక పోయారు . పల్లెటూరి నుండి వచ్చిన ఒక రైతు దాన్ని ఎగిరేట్లు చేయగలిగాడు . అందరూ ఆశ్చర్యపోయారు . ఇప్పుడు డేగలు రెండూ ఉత్సాహంగా ఎగురుతున్నాయి పైపైకి ! రాజు , రైతును అడిగాడు , ఏం చేసావని ?? " ఏంలేదు ప్రభూ ! అది కూర్చున్న కొమ్మను నరికేసాను . అంతే ! " వినయంగా చెప్పాడు . ( మనం కూడా అద్భుతమైన ఎత్తైన లక్ష్యాలు అందుకోగలిగిన వాళ్ళమే . మనలోనూ అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి . కానీ మనం సాధారణంగా మనకు తెలిసిన పనులకే అతుక్కుపోయి వాటిలోనే జీవితాన్ని వెతుక్కుంటాం . నిజానికి అనేకానేక అవకాశాలు ఉన్నాయి . మనం వాటిని నిర్లక్ష్యం చేస్తాం . పట్టించుకోం . తెలుసుకొనే ప్రయత్నం చెయ్యం . రిస్క్ చెయ్యం . అందుకే మన జీవితాలు నిస్సారంగా , నిరాసక్తంగా , నిస్తేజంగా , నిరుత్సాహంగా సాదాసీదాగా గడిచిపోతున్నాయి . మనం పట్టుకొని వేలాడుతున్న సుఖమైన స్థితి ( Comfort Zone ) అనే కొమ్మను నరికేసుకొని బయటికి వస్తే ఇప్పుడున్న దానికన్నా గొప్పగా బ్రతకవచ్చు .

ఒక టాక్సీ డ్రైవర్ - #2

ఒక టాక్సీ లోని ప్రయాణికుడు డ్రైవర్ను ఏదో అడగడానికి వెనక సీటు నుండి డ్రైవర్ వీపుమీద చిన్నగా తట్టాడు . దెబ్బకు డ్రైవర్ బెంబేలెత్తి , ఎదురుగా పోతున్న బస్సును ఢీకొనబోయి , తప్పించుకుని , ఫుట్ పాత్ మీదికెక్కి , ఓ షాప్ కి కొన్ని అంగుళాల దూరంలో గుద్దుకోకుండా ఆగిపోయాడు . కొన్ని నిమిషాలు టాక్సీలో అంతా నిశ్శబ్ధం !! " సార్ ఇంకెప్పుడు అలా వీపు మీద కొట్టకండి . నాకు ఒక్కసారిగా ప్రాణం పోయినంతపనైంది . " ప్రయాణీకుడు సారీ చెప్పి " చిన్నగా వీపుమీద తట్టినందుకు ఇంతగా బెదిరి పోవాలా " అన్నాడు . డ్రైవర్ వెంటనే , " నిజానికి అది మీ తప్పు కాదు లెండి , ఈ రోజే మొదటిసారి క్యాబ్ డ్రైవర్ గా నా జీవితాన్ని మొదలు పెట్టాను ..... గత 25 సంవత్సరాలుగా నేను శవాలను మోసుకెళ్లే వాహనాన్ని డ్రైవ్ చేసే వాడిని ".